రాష్ట్రీయం

ఫీజుల దోపిడీపై రోడ్డెక్కిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని కెజి టు పిజి వరకూ ఉచిత విద్యను పటిష్టంగా అమలుచేయాలని తెలంగాణలో గురువారం నాడు జరిగిన బంద్ విజయవంతం అయ్యిందని విద్యార్ధి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణలో పోలీసులు వందలాది విద్యార్ధులను అరెస్టు చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కాలేజీ నుండి ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని అక్రమంగా విద్యార్ధి సంఘం నేతలను అరెస్టు చేసి గాంధీనగర్‌కు తరలించారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదరిశ బి సాంబశివ, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, పిడిఎస్‌యు రాష్టక్రార్యదర్శి పున్నా నర్సయ్య, టివివి రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా సుమారు 300 మంది విద్యార్ధి నేతలను పోలీసులు అరెస్టు చేశారని వారు చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని ఇంత దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. వీటి నియంత్రణకు ఎన్నో జీవోలు ఉన్నా అమలుచేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారు విమర్శించారు. విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా ప్రతిపక్షపార్టీలు, హైకోర్టు సైతం ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందలేదని, అదే విధంగా రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలను తక్షణమే మూసివేయాలని వారు కోరారు.

చిత్రం.. గురువారం విద్యార్ధి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ హైదరాబాద్‌లో నిర్వహించిన ఆందోళనలో విద్యార్ధులను అరెస్టు చేస్తున్న పోలీసులు