రాష్ట్రీయం

కృష్ణా డెల్టాకు చేరువలో గోదారమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి, జూలై 14: పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి తరలిస్తున్న గోదావరి జలాలు కృష్ణా డెల్టాను చేరుకోనున్నాయి. డెల్టాకు చేరువలోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట తమ్మిలేరు అక్విడెక్టు వద్దకు గురువారం ఉదయం గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అక్విడెక్టువద్ద పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం కుడికాల్వ ద్వారా తమ్మిలేరు అక్విడెక్టు వద్దకు గురువారం ఉదయం 8.30 గంటలకు గోదావరి నీరు చేరుకుంది. ఆ సమయానికి అక్కడకు చేరుకున్న ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళల్లో అనందోత్సాహాలు నెలకొన్నాయి. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి గోదావరి మాతకు ఆహ్వానం పలుకుతూ పురోహితుల మంత్రోచ్చారణల మధ్య పసుపు, కుంకుమ, పూలతో పూజలు నిర్వహించారు. ప్రభాకర్, బుజ్జిలపై రైతులు, మహిళలు, స్థానికులు పూలవర్షం కురిపించి, రంగులు జల్లి తమ సంతోషాన్ని చాటారు.

చిత్రం.. ప.గో. జిల్లా తమ్మిలేరు అక్విడెక్టు వద్ద గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తున్న
ప్రభుత్వ విప్ చింతమనేని, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి