రాష్ట్రీయం

బిడ్డకు పునర్జన్మ ఇచ్చిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ప్రాణాంతక కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రెండేళ్ల బాబుకు అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీని యశోద ఆసుపత్రి వైద్యబృందం విజయవంతంగా నిర్వహించింది. పిల్లాడి తల్లి స్వయంగా తన లివర్‌లోని కొంత భాగాన్ని దానం చేయడంతో ఎనిమిది గంటలకు పైగా శ్రమించిన యశోద లివర్ ట్రాన్స్‌ప్లాంటేషనన్ వైద్య బృందం మృత్యువాకిట నిలిచిన రెండేళ్ల బాబుకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స ద్వారా కొత్త జీవితాన్ని ప్రసాదించారు. గురువారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన వైద్యులు కాలేయ మార్పిడి చీఫ్ సర్జన్ డా.పి.బాలచంద్రన్ మీనన్, అమిర్ దీప్ యాదవ్, ప్రేమ్‌కుమార్, టి.పి.కార్తీక్, భరత్ వాశ్వినిలు సర్జరీ గురించిన వివరాలు వెల్లడించారు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన రమణ, మనోహర్ దంపతుల ఏకైక సంతానం రెండేళ్ల మాస్టర్ మహసిన్ దత్తా హెపటోబ్లిస్టోమా అనే ప్రాణాంతకమైన కాలేయ కాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతని తల్లిదండ్రులు జనవరిలో తమ బాబును సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాబును పరీక్షించిన చిన్న పిల్లల డాక్టర్ వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల బాబుకు లేకపోవడం గమనించారు. బాబు పొత్తికడుపులో కణితితోపాటు ఛాతిలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. లివర్ కాన్సర్ సంబంధిత లక్షణాలుగా భావించిన సదరు వైద్యులు వెంటనే మెడికల్ ఆంకాలజిస్ట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్లను కలిసి మరింత లోతుగా అధ్యయనం చేసి లివర్ మార్పిడి ఒక్కటే పరిష్కారమని తేల్చారు. లివర్ మార్పిడికి సంబంధించిన అత్యధిక పరిజ్ఞానం, శిక్షితులైన వైద్య బృందం యశోద ఆసుపత్రిలో అందుబాటులో వున్నా బాబు వయసురీత్యా శస్త్ర చికిత్స అత్యంత క్లిష్టమైనట్టు పేర్కొన్నారు. తమ బాబును ఎలాగైనా బతికించాలని అందుకు లివర్‌ను దానం చేయడానికి సిద్ధంగా వున్నట్టు తల్లి తెలపడంతో యశోద వైద్య బృందం సిద్ధమైనట్టు తెలిపారు. ముందు మూడు స్టేజిలలో బాబుకు అత్యాధునిక కిమోథెరపీతో కాన్సర్‌కు చికిత్స అందించి అతని శరీరాన్ని సర్జరీకి తట్టుకునే స్థాయికి తీసుకురావడమే కాకుండా చాతిలో వున్న ఇన్‌ఫెక్షన్‌ను, పొత్తి కడుపులోవున్న కాన్సర్ కణితిని నిర్మూలించడం ఆ తర్వాత చివరి స్టేజిలో శస్త్ర చికిత్స ద్వారా లివర్ మార్పిడికి డాక్టర్ల బృందం సమాయత్తమయ్యారు. డాక్టర్ల బృందం కలిసి నిర్ణయించిన విధానాన్ని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కిమో థెరపీ ద్వారా బాబుకు మూడు స్టేజిల చికిత్స ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు యశోదా డాక్టర్లు తెలిపారు. ఇక చివరిదైన అత్యంత క్లిష్టతరమైన లివర్ మార్పిడి శస్త్ర చికిత్సను మే నెల 26న యశోద వైద్య బృందం విజయవంతంగా చేసారు.

చిత్రం.. తల్లి రమణతో మాస్టర్ మహసిన్ దత్తా