రాష్ట్రీయం

జన్మభూమి కమిటీపై జగడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఇప్పుడు అధి నాయకత్వానికి తలనొప్పిగా పరిణమించాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి టిటిపిలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో, జన్మభూమి కమిటీల కొనసాగింపుపై పాత-కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కిందిస్థాయి కార్యకర్తలకు గుర్తింపునిచ్చేందుకు, తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో గ్రామ, పట్టణ, వార్డు స్థాయిని బట్టి పార్టీ కార్యకర్తలను నియమించారు. ఇందులో సంబంధిత ప్రభుత్వ అధికారి పర్యవేక్షణ ఉంటున్నప్పటికీ, పెత్తనం మాత్రం పార్టీ కార్యకర్తలదే. కమిటీ సూచించిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. చిన్న పని చేయాలన్నా జన్మభూమి కమిటీ అనుమతి తప్పనిసరి. దీంతో కమిటీలో ఉండే నేతలకు డిమాండ్ పెరిగింది. పెన్షన్లు, ఇల్లు, కార్డులు వంటి కీలకమైన సిఫార్సులన్నీ ఈ కమిటీ చేస్తుండటంతో, చాలాచోట్ల కమిటీలు అవినీతిమయంగా మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం కొందరు కార్యకర్తలను బతికించేందుకు మొత్తం పార్టీనే జనాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని, చాలాకాలం నుండి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబునాయుడు కూడా ఒక దశలో కసరత్తు చేసి, జన్మభూమి కమిటీలు రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే మంత్రివర్గంలో చాలామంది దానిని వ్యతిరేకించారు. దాంతో బాబు ప్రయత్నం నిలిచిపోయింది.
కాగా, వైసీపీ నుంచి తెదేపాలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలు, తమ నియోజకవర్గాల్లో ఉన్న జన్మభూమి కమిటీలను ప్రక్షాళన చేసే వ్యవహారాన్ని ప్రతిష్టగా తీసుకుంటున్నారు. తాము రెండేళ్లు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, ఇదే కమిటీలు తమను అడ్డుకుని అవమానించడమే దానికి ప్రధాన కారణం. ఇప్పుడు తాము కూడా తెదేపాలోకి చేరినందున, పాత కమిటీలు రద్దు చేసి, తమ అనుచరులతో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వారి ప్రయత్నాలను మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న ఇంచార్జిలు అడ్డుకుంటున్నారు. నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చి, ఎప్పటి నుంచో పని చేస్తున్న కార్యకర్తలను వద్దంటే కుదరదని అంటున్నారు.కొత్తగా చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎండివో, మునిపల్ కమిషనర్లపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ, జన్మభూమి కమిటీ నిర్ణయం లేకపోతే తామేమీ చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
దీనితో ఏమి చేయాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల మంజూరయితే అడిగిన వెంటనే చేయవచ్చని, ఇది జన్మభూమి కమిటీల రద్దు వ్యవహారమయినందున, తాము జోక్యం చేసుకుంటే జిల్లా నేతలు ఎక్కడ తమపై బాబుకు ఫిర్యాదు చేస్తారేమోనన్న భయం ఇంచార్జి మంత్రుల్లో ఉంది. మీరు సీఎం దగ్గర తేల్చుకోమని, అందులో తమను ఇరికించవద్దని సున్నితంగా చెప్పి తప్పించుకుంటున్నారు.