ఆంధ్రప్రదేశ్‌

మావోల భయంతో బిజెపిలో రాజీనామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూలై 14: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. దాడులు చేసి వరుసగా బిజెపి నేతలను హత్య చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కలకలం మొదలైంది. అధికార పార్టీ నేతలంతా పార్టీకి రాజీనామా చేయాలనే మావోయిస్టుల డిమాండ్ మేరకు దండకారణ్యంలోని బస్తర్ ప్రాంతంలో బిజెపి నాయకులు రాజీనామాల పర్వానికి తెర లేపారు. సామూహికంగా రాజీనామాలు చేస్తుండటంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిజెపి అధిష్టానం కలవరపాటుకు గురవుతోంది. ఆపరేషన్ గ్రీన్‌హంట్ 3వ దశను నిలిపివేయాలని, గగనతలం నుంచి మావోయిస్టులపై దాడులను మానుకోవాలని, కేంద్ర బలగాలను దండకారణ్యం నుంచి ఉపసంహరించుకోవాలని మావోయిస్టు పార్టీ గత కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వస్తోంది. పార్టీ కేడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు బిజెపి నేతలపై దాడులకు తెగబడుతున్నారు. గడిచిన మూడు నెలల్లో ముగ్గురు బిజెపికి చెందిన ముఖ్య నేతలను మావోయిస్టులు హత్య చేశారు. బస్తర్‌లో ఇప్పటి వరకు 28 మంది ముఖ్య నేతలు మావోయిస్టుల ఒత్తిడి మేరకు పార్టీకి రాజీనామా చేశారు.