ఆంధ్రప్రదేశ్‌

హక్కులు సాధించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: నవ్యాంధ్ర రాజధానికి రావాల్సిన నిధులు, హైకోర్టు విభజన, అంతర్రాష్ట్ర జలవివాదాలు, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు వంటి అంశాలకు పార్లమెంటు సమావేశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. వివాదాలకు, విమర్శలకు తావివ్వకుండా మిత్రపక్షమైన బిజెపి మద్దతుతో సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలతోపాటు శనివారం జరగనున్న అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం నగరంలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో టిడిఎల్పీ సమావేశం నాలుగు గంటలపాటు జరిగింది. విభజన చట్టంలోని హామీలు అమలుకోసం పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన జలవివాదాలు, హైకోర్టు విభజన అంశాలను కూడా ఎంపిలు లేవనెత్తాలని చెప్పారు. తెలంగాణ ఎంపిలు రాజకీయాలకు అతీతంగా వారి రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్నవిధంగానే మన రాష్ట్రంలోని సమస్యల పరిష్కరానికి ఎంపిలు పార్టీలకు అతీతంగా పార్లమెంట్‌లో స్పందించాలని కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన బిజెపి ఎంపిలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు పార్లమెంట్‌లో టిడిపి ఎంపిలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినట్లు సమాచారం. ప్రత్యేక హోదాకు సంబంధించి కెవిపి రామచంద్రరావుప్రవేశ పెట్టిన ప్రైవేట్ బిల్లుకు సంబంధించి, పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో వ్యవహరించాల్సిన వ్యూహంపై కూడా సమావేశంలో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎప్పటికప్పడు వస్తున్న వివాదాల కారణంగా ఏపికి విభజన ద్వారా లభించాల్సిన హక్కులు, నిధులు వంటి ముఖ్యమైనవి మరుగున పడుతున్న తీరును పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు ఏపి ఎంపిలకు సిఎం బాబు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

చిత్రం... పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు