రాష్ట్రీయం

డిఆర్‌డిఎల్ డైరెక్టర్‌గా ఎంఎస్‌ఆర్ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ డైరెక్టర్‌గా ఎంఎస్‌ఆర్ ప్రసాద్ నియమితులయ్యారు. 1961 తర్వాత డిఆర్‌డిఎల్ డైరెక్టర్ అయిన తెలుగు వ్యక్తి ఎంఎస్‌ఆర్ ప్రసాద్. అంతకుముందు ఈ పదవిలో డాక్టర్ టెస్సీ థామస్ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. 55 ఏళ్ల ప్రసాద్ అడ్వాన్స్‌డ్ నేవల్ సిస్టమ్స్ గ్రూప్‌నకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. డిఆర్‌డిఓ పరిధిలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు క్షిపణుల నమూనాలు, అభివృద్ధి ,ఉత్పత్తి వ్యవహారాలను చూస్తుం ది. ఈ రంగంలో ప్రసాద్ గణనీయమైన సేవలు అందించారు. మద్రాస్ ఐఐటి నుండి బిటెక్ చేసిన ప్రసాద్, ముంబై ఐఐటి నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేశారు. 1984లో డిఆర్‌డిఎల్‌లో చేరిన ప్రసాద్ అంచెలంచెలుగా డైరెక్టర్ పదవిని అధిరోహించారు. కాగా డిఆర్‌డిఓలో మిస్సైల్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా రక్షణ మంత్రి సైంటిఫిక్ అడ్వయిజర్‌గా ఉన్న జి సతీష్‌రెడ్డిని నియమించారు.