రాష్ట్రీయం

కాల్‌మనీపై రచ్చ రచ్చ .. దద్దరిల్లిన అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: విజయవాడ కాల్‌మనీ రాకెట్ వ్యవహారంపై ఆంధ్ర అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టువిడుపులు లేకుండా తమ వైఖరులకే కట్టుబడి ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. చివరకు విపక్ష పార్టీల సస్పెన్షన్ల మధ్య ముగిసింది. ఈ గందరగోళం మధ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు కాల్‌మనీ రాకెట్‌పై ప్రకటన చేశారు. కాల్‌మనీ వ్యవహారంలో నిందితులు ఎంతటివారైనా, ఏ పార్టీవారైనా వదిలే ప్రసక్తిలేదని శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో కాల్‌మనీ రాకెట్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను శాసన సభకు వివరించారు. పోలీసులు 227 కేసులు నమోదు చేశారన్నారు. అరెస్టైన 188మంది నిందితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందినవారు 65మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన 20మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన 12మంది, సిపిఐ పార్టీకి చెందిన ఆరుగురు, సిపిఎం పార్టీకి చెందిన ఒకరు, బిజెపికి చెందిన నలుగురు, లోక్‌సత్తా పార్టీకి చెందిన ఇద్దరు సానుభూతిపరులు ఉండగా, ఇతరులు 78మంది ఉన్నారన్నారు. ఈ విషయమై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు. బాధితులు, ఫిర్యాదుదారులు ఎవరైనా జ్యుడీషియల్ కమిషన్ ముందుకాని, పోలీసు శాఖకుగాని స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తిలేదన్నారు. చంద్రబాబు ప్రసంగం జరుగుతున్నంత సేపూ వైకాపా ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పదిమంది డౌన్ డౌన్ అంటే మేం భయపడాలా? నోరు పారేసుకుంటే మంచిదికాదు. నోరుందని మాట్లాడుతున్నారు. సబ్జెక్టువుంటే మాట్లాడండి. వీళ్లు ఎమ్మెల్యేలా..? బజారు రౌడీలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇస్తూ, సిఎం చంద్రబాబు తనపాటికి తాను ప్రకటనను చదువుకుంటూ వెళ్లారని, పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాటించుండా సభను నిర్వహించి సభ్యుల హక్కుల కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి శాసనసభను నా జీవితంలో ఇంతవరకూ చూడలేదన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ సభ్యుల హక్కు అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దాయిగా ఉండి కాల్‌మనీపై స్టేట్‌మెంట్ ఇవ్వడం, దానిపై మాట్లాడడానికి సభ్యులకు అవకాశం ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కేసులో నిందితులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇక్కడే ఉన్నారని, వారిని అరెస్టు చేయలేదని, ఈ నేపథ్యంలో బాధితులకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. కాల్‌మనీపై ముందు చర్చ జరగాలని, తర్వాత ప్రభుత్వం ప్రకటనకు అంగీకరిస్తామని జగన్ పేర్కొనగా, అంతకంటే ముందు అంబేద్కర్‌పై చర్చ, తర్వాత కాల్‌మనీపై ప్రకటన, చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఉభయ పార్టీల మధ్య వాగ్వాదం తలెత్తింది. చివరకు అంబేద్కర్‌పై చర్చ ముగిసేంత వరకూ ప్రతిపక్ష నేత జగన్‌సహా 58మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. కాగా సిఎం చంద్రబాబు మాట్లాడుతుంగా వైకాపా ఎమ్మెల్యే రోజా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆమెను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. చివరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఫలానా నిందితులు మీ పార్టీ ముఖ్య నేతలతో ఫోటోలు దిగారంటూ పరస్పరం విమర్శించుకున్నారు. ఈ అంశంపై చర్చ ముగిసినట్టు స్పీకర్ ప్రకటించి గందరగోళం మధ్య సభను శనివారానికి వాయిదా వేశారు.

విపక్షం సస్పెన్షన్

పోడియంను చుట్టుముట్టిన వైకాపా
కాల్‌మనీపై చర్చకు పట్టు
సస్పెన్షన్ తీర్మానం చేసిన యనమల
నిష్క్రమించిన జగన్, ఎమ్మెల్యేలు
అంబేద్కర్‌పై చర్చకు దూరం

కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై వరుసగా రెండోరోజూ ఆంధ్ర అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా 58మంది వైకాపా ఎమ్మెల్యేలను సభనుంచి అంబేద్కర్ జయంతిపై చర్చ ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే కాల్‌మనీ అంశంపై వైకాపా చర్చకు పట్టుబట్టింది.
స్పీకర్ పోడియంను వైకాపా ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. దీంతో అంబేద్కర్‌పై చర్చ ముగిసేంత వరకూ వైకాపాను సస్పెండ్ చేయాలంటూ మంత్రి యనమల తీర్మానం ప్రవేశపెట్టడంతో స్పీకర్ ఈమేరకు నిర్ణయం
తీసుకున్నారు.