జాతీయ వార్తలు

లెవీ బియ్యం సేకరణ పునరుద్ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కేంద్ర ప్రభుత్వం లెవీ బియ్యం సేకరణ విధానాన్ని రద్దు చేయటం పట్ల తెలంగాణ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. సుఖేందర్ రెడ్డి శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. 1978 సంవత్సరం నుండి అమలు జరుగుతున్న మిల్లర్ల నుండి 25 శాతం లెవీ బియ్యం సేకరణ విధానం 1978 నుండి అమలు జరుగుతోందని, దీనివలన ప్రజా పంపిణీ వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతోందని ఆయన వాదించారు. మిల్లర్లు రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారా? లేదా? అనేది తెలుసుకునేందుకు అవసరమైన యంత్రాంగం లేదని, మిల్లర్లు నాణ్యమైన బియ్యా న్ని బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారనే అనుమానం, ప్రజా పంపిణీ వ్యవస్థకు మిల్లర్లు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో లెవీ బియ్యం విధానాన్ని రద్దు చేయటం ఎంత మాత్రం సమర్థనీయం కాదని సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లెవీ బియ్యం సేకరణ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం చూపించిన మూడు కారణాలను సరిదిద్దుకునేందుకు అవకాశం లేదా? అని గుత్తా నిలదీశారు. లెవీ బియ్యం విధానాన్ని రద్దు చేయటం వలన ప్రజా పంపిణీ వ్యవస్థపై ఎంతో ఆధారపడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తాజా నిర్ణయం మూ లంగా భారత ఆహార సంస్థ లెవీ బియ్యం సేకరణ నిలిపివేసిందన్నారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ నిర్ణయాన్ని మార్చుకోవలసిందిగా మిల్లర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని సుఖేందర్ రెడ్డి వివరించారు. మిల్లర్ల నుండి ఒక నిర్ధారిత బియ్యాన్ని కొనుగోలు చేసే విధంగా భారత ఆహార సంస్థను ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలా జరగకపోతే మిల్లర్ల వద్ద బియ్యం నిల్వలు పేరుకుపోతాయని ఆయన చెప్పారు.
పత్తి కనీస మద్దతు ధర పెంచాలి
తెలంగాణలో పత్తి కనీస మద్దతు ధరను 4,150 రూపాయల నుండి ఐదు వేల రూపాయలకు పెంచాలని టిఆర్‌ఎస్ ఎంపి బి.వినోద్‌కుమార్ ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వినోద్‌కుమార్ శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలోని దాదాపు ఒక కోటి ఎకరాలకు సాగునీరు అందుతోందనీ, ఇందులో దాదాపు 42 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులు దాదాపు నలభై రెండు లక్షల ఎకరాల్లో పత్తి పండించారంటూ, వీరిని ఆదుకునేందుకు కనీస మద్దతు ధరను పెంచవలసిందేనని ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిటీ నివేదికలో చేసిన సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల అనంతరం ఈ హామీని మరిచిపోయారని వినోద్‌కుమార్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముం దుకు వచ్చి పత్తి కనీస మద్దతు ధరను ఐదు వేల రూపాయలకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.