తెలంగాణ

ఇంకా వదలని దుర్వాసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, జూలై 17: కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని పెద్దమ్మ అడవుల్లో ఎముకల నూనె తయారీ కేంద్రంలో యంత్రాలు అలాగే ఉన్నాయి. కేంద్రం వద్ద జంతువుల వ్యర్థ పదార్థాలను ఆరబెట్టారు. కేంద్రం నడవకపోయినా అక్కడ జంతువుల ఎముకలు, వ్యర్థ పదార్థాలు ఉండడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. గత నెల తయారీ కేంద్రంపై ‘ఆంధ్రభూమి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ పెద్దమ్మ అడవుల్లో ఎముకల నూనె తయారీ కేంద్రం,,?’, ‘దట్టమైన అడవుల్లో ఎముకల నూనె తయారీ..!’, ‘అడవుల్లో అంతా గప్‌చుప్’ అనే వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తలకు స్పందించిన సంబంధిత అధికారులు దాడులు నిర్వహించి ఎముకల నూనె తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. అయతే, నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం కేంద్రం వద్ద వ్యర్థ పదార్థాలను ఆరబెట్టారు. ఓ కాపాలదారుడు మాత్రమే ఆ ప్రాంతంలో పనులను చక్కదిద్దుతున్నాడు. ఎముకల నూనె తయారీ కేంద్రంపై దాడులు జరిగి నెల రోజులు గడుస్తున్నా అడవుల్లో దుర్వాసన వదలడం లేదని ఆ ప్రాంత రైతులు, ప్రజలు వాపోతున్నారు. సీజ్ చేసిన నిర్వాహకులు అక్కడ నుంచి సంబంధిత యంత్రాలను తీయకుండా వ్యర్థ పదార్థాలను ఆరు బయట ఆరబెడుతుండడంతోదుర్వాసన వెదజల్లుతోందని పలువురు పేర్కొన్నారు.
పోలీసుల ప్రమేయం లేదు
పెద్దమ్మ అడవుల్లో గుట్టుగా సాగుతున్న ఎముకల నూనె తయారీ కేంద్రంపై గత నెల 12న ‘ ఆంధ్రభూమి’ ప్రధాన సంచికలో ‘అడవుల్లో అంతా గప్‌చుప్’ అనే కథనం ప్రచురితమైంది. ఈ కేంద్రం నిర్వాహకులు సంబంధిత అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ప్రతి నెల రూ.5 లక్షల మామూళ్లు ముట్టజెపుతున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో
నరుూం ముఠా సభ్యులు!
టాకీస్ యజమానిపై దాడిని భగ్నం చేసిన పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జూలై 17: నల్లగొండ జిల్లా పోలీసులు నరుూం ముఠాకు చెందిన ఎనిమిది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల్‌లోని భాస్కర్ టాకీస్ యజమాని మంచికంటి భాస్కర్‌పై నరుూం ముఠా దాడికి సిద్ధపడుతున్న తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు వారి పథకాన్ని భగ్నం చేసి ముఠా సభ్యులు ఎనిమిది మందిని అరెస్టు చేసి నల్లగొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. భాస్కర్ టాకీస్ భూమి హక్కుల విషయంపై ఇటీవల భాస్కర్ కుటుంబ సభ్యుల మధ్య తగాదా నడుస్తోంది. ఈ వివాదంలో భాస్కర్ కుటుంబ సభ్యులలో కొంతమంది నరుూం ముఠాను ఆశ్రయించారని, దీంతో వారు రంగంలోకి దిగి భూ వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ గత రెండు రోజులుగా భాస్కర్‌ను ఫోన్ల ద్వారా బెదిరింపులకు గురిచేశారు. అయతే, భాస్కర్ వారి హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో ఏకంగా అతడిపై దాడి చేసేందుకు రెక్కి నిర్వహించి స్కార్పియో వాహనంలో భాస్కర్ కోసం మాటువేశారు. భాస్కర్ ఇంటి పరిసరాల్లో సంచరించిన నరుూం ముఠా కదలికలను కొంతమంది పసిగట్టి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్కార్పియో వాహనంలో సంచరిస్తున్న నరుూం ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో గతంలో సాంబశివుడు, కొనపురి రాములుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న సర్వేల్‌కు చెందిన సురేష్ కూడా ఉన్నారు. ఈ కేసు వివరాలను మరింత విచారణ నేపథ్యంలో పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. సమగ్ర విచారణ తర్వాతే నేడో రేపో పూర్తి వివరాలను వెల్లడిస్తామని సిసిఎస్ పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రేమ వేధింపులతో
విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్ జిల్లాలో విషాదం
ఇల్లంతకుంట, జూలై 17: ఓ యువకుడు ప్రేమించమని, పెళ్లి చేసుకుంటానని ఓ విద్యార్థినిని వెంటబడుతూ బెదిరించడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన కరీంనగర్ జిల్లాఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలి బంధువుల, ఎస్‌ఐ కథనం ప్రకారం.. పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన పసుల దివ్య (18) అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థిని అదే గ్రామానికి చెందిన పసుల శ్రీకాంత్ (21) అనే యువకుడు ప్రేమించుమని, పెళ్లి చేసుకుంటానని బలవంతం చేస్తూ బెదిరించడం వల్ల భయాందోళనతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దివ్య మండల కేంద్రంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతుండేది. యువకుడు కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. రోజు కళాశాలకు వెళ్లేటప్పుడు, తదనంతరం ఇంటికి చేరుకున్నాక ప్రేమించుమని, పెళ్లి చేసుకుంటానని దివ్యను బెదిరించాడని మృతురాలి బంధువులు పేర్కొన్నారు. గత రెండు నెలల నుంచి శ్రీకాంత్ వేధింపుల వల్ల దివ్య ఎటూ నిర్ణయం తీసుకోకుండా ప్రేమను నిరాకరించినట్లు చెప్పినప్పటికీ యువకుడు అదే తీరుగా వ్యవహరించడంతో భయాందోళనకు లోనై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు రోదించారు. మృతురాలికి తంఢ్రి నర్సయ్య, తల్లి లక్ష్మి ఉన్నారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ ఎల్లయ్య గౌడ్ పేర్కొన్నారు.