రాష్ట్రీయం

జగన్ సహా వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై వరుసగా రెండో రోజు కూడా ఆంధ్ర అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 58 మంది వైకాపా ఎమ్మెల్యేలను సభ నుంచి అంబేద్కర్ జయంతిపై చర్చ ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చ తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయాలనే దానిపై వైకాపా ఎమ్మెల్యేలు పట్టుబట్టడం, ముందుగా ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం చెప్పడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ముందనుకున్నట్లుగా చర్చ జరిగిన తర్వాతనే కాల్‌మనీ రాకెట్‌పై చర్చ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. అంబేద్కర్ మహాశయుడి పేరును రాజకీయాలకు లాగవద్దని, అవసరమైతే రెండు రోజుల పాటు ఈ అంశంపై చర్చిద్దామని ప్రతిపక్ష పార్టీ చెప్పినా అధికార పార్టీ మాత్రం దిగిరాలేదు. దీంతో సభను రెండు సార్లు వాయిదా వేసినా సభ అదుపులోకి రాలేదు. దీంతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వైకాపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ సభ నుంచి వైకాపా ఎమ్మెల్యేలను అంబేద్కర్‌పై చర్చ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ వైకాపా సభ్యులు సభలోనే బైఠాయించారు. ఈ లోగా మార్షల్స్ రప్పించాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేస్తున్న వైకాపా ఎమ్మెల్యేలను సభలో నుంచి వెళ్లిపోవాల్సిందిగా స్పీకర్ కోరారు. ఈ లోగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం పెద్ద సంఖ్యలో మార్షల్స్ సభలోకి వచ్చారు. ఇందులోమహిళా మార్షల్స్ కూడా ఉన్నారు. కొంత సేపు మార్షల్స్‌కు, వైకాపా ఎమ్మెల్యేలకు తోపులాట జరిగింది. అనంతరం వైకాపా ఎమ్మెల్యేలు తమకు తాముగా సభ నుంచి నిష్క్రమించారు. సస్పెండైన వైకాపా ఎమ్మెల్యేలు అంబేద్కర్‌పై చర్చ ముగిసిన తర్వాత సభలోకి వచ్చారు. తొలుత ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే కాల్‌మనీ వ్యవహారంపై వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో వైకాపా ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు అచ్చెంనాయుడు, యనమల రామకృష్ణుడు, పీతల సుజాత మాట్లాడుతూ సభను అడ్డుకునే దుష్ట సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని, కాల్‌మనీపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా సభలో కాల్‌మనీపై చర్చ జరిపిన తర్వాత ప్రకటన చేయాలని, నేరుగా ప్రకటన ఇవ్వడం వల్ల ఒకటి రెండు వివరణలు అడిగేందుకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. అంబేద్కర్ అంశాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది. సభ మళ్లీ గంట తర్వాత సమావేశమైన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేదు. టిడిపి ఎమ్మెల్యేలు బి రమణమూర్తి, అయినాబత్తుల ఆనందరావు, తలారి ఆదిత్య, యామినీబాల, నక్కా ఆనందబాలు, పీతల సుజాత మాట్లాడుతూ, దళితులు, బిసిలకు ఎనలేని సేవలు అందించిన మహనీయుడు అంబేద్కర్‌పై చర్చకు సహకరించాలని, అడ్డుకోవద్దని అంటూ, వైకాపా అధినేత జగన్‌కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని విమర్శించారు. సభకు అడ్డుతగులుతున్న వైకాపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసైనా సరే సభను నిర్వహించాలని కోరారు. వైకాపాలోని దళిత ఎమ్మెల్యేలు అంబేద్కర్‌పై చర్చ జరిగేందుకు సహకరించాలని వారు కోరారు. కాని సభ నియంత్రణలోకి రాకపోవడం, పోడియం వద్దనే వైకాపా ఎమ్మెల్యేలు నిలబడి నినాదాలు చేయడంతో మంత్రి యనమల సిఫార్సుమేరకు మొత్తం వైకాపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత దేశానికి అంబేద్కర్ చేసిన సేవలపై చర్చను ప్రారంభించారు.