ఆంధ్రప్రదేశ్‌

హోదాపై మిత్రభేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం తెదేపా-్భజపా మిత్రపక్షాల మధ్య మరోసారి చిచ్చుకు కారణమవుతోంది. అసలు ఓటింగు సాధ్యం కాని ప్రత్యేక హోదా బిల్లును అడ్డుపెట్టుకుని తెదేపా రాజకీయం చేస్తోందని, కేంద్రంలో ఇద్దరు మంత్రులుండగా, కాంగ్రెస్ ఎంపి కెవిపి ప్రైవేటు బిల్లును ఎలా సమర్థిస్తుందని భాజపా నేతలు మండిపడుతున్నారు. ఏడాది నుంచీ ఈ అంశంలో తెదేపా కాంగ్రెస్ నేతలతో హోదాపై పరోక్షంగా ఒత్తిడి చేయిస్తూ, మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోందన్న అనుమానం భాజపాలో వ్యక్తమవుతోంది. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఓటింగుకు వస్తుందన్న చర్చ నేపథ్యంలో, ఓటింగు జరిగితే తమ మద్దతు ఉంటుందని తెదేపా ఎంపిలు జెసి దివాకర్‌రెడ్డి, టిజి వెంకటేష్ బహిరంగంగా ప్రకటించడాన్ని బిజెపి తప్పుపడుతోంది.
దీని వెనుక తెదేపా రహస్య అజెండా ఉందని, అసలు తెదేపా నాయకత్వమే కాంగ్రెస్ ఎంపితో బిల్లు పెట్టించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరైతే బిల్లు ప్రవేశపెట్టారో ఆయన బినామీ కంపెనీకి వైఎస్ ప్రభుత్వం గతంలో ప్రాజెక్టులు కట్టబెట్టిందని ఆరోపించిన తెదేపా, ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టును అదే కంపెనీకి కట్టబెట్టిందని, దాన్ని బట్టి ఎవరి రహస్య బంధమేమిటో బట్టబయలయిందని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుడి ద్వారా ఒత్తిడి రాజకీయం చేస్తున్న తెదేపాకు, తాము కూడా సరైన సమాధానం చెబుతామంటున్నారు. కేంద్రంలో ఇద్దరు మంత్రులున్న తెదేపా, కాంగ్రెస్ సభ్యుడి ప్రైవేటు బిల్లు ఓటింగు వరకూ వస్తే దానిని సమర్ధించడం అనైతికం కాదా? అని బిజెపి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరు చెబుతున్న తెదేపా నాయకత్వానికి, అసలు ఆ బిల్లు ఓటింగు వరకూ వచ్చేది లేదన్న విషయం తెలిసి కూడా హోదా విషయంలో తమ పార్టీని ముద్దాయిగా నిలబెట్టేందుకు కుట్ర చేస్తోందని బిజెపి నేతలు మండిపడుతున్నారు. మిత్రధర్మం పాటిస్తున్న తమను తెదేపా కావాలనే రెచ్చగొడుతోందని బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఫిరాయింపునిరోధక చట్టంపై ఇచ్చిన ప్రైవేటు మెంబరు బిల్లుకు తాము కూడా మద్దతునివ్వవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు.
హోదా అంశాన్ని రాష్ట్ర ప్రయోజనాలంటున్న తెదేపా, ఫిరాయింపు వ్యవహారం నైతిక విలువలతోపాటు, జాతీయ ప్రయోజనాల కోసమయిందున, తాము కూడా వైసీపీ ప్రైవేటు మెంబరు బిల్లుకు మద్దతునిస్తే తప్పేమిటని వాదిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ వాదనను తాము కూడా సమర్థిస్తే, ఇక మిత్రధర్మానికి అర్థం ఏముంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. తెదేపా నేరుగా రాజకీయం చేయకుండా, కెవిపి భుజం మీద తుపాకి పెట్టి తమ పార్టీపై గురిపెడుతోందని, ఈ విషయం బహిరంగ రహస్యమేనని, దానికి రాష్ట్ర ప్రయోజనాలనే పేరు పెట్టడం వింతగా ఉందని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. ‘కెవిపి ప్రైవేటు బిల్లు వ్యవహారం ఎవరైతే దొంగతనం చేశారో వారే దొంగ అని అరిచినట్లుంది. ఈ రాష్ట్రం అధోగతి కావడానికి, తెలంగాణలో రాజకీయ లబ్థి పొందేందుకు చేసిన ప్రయత్నంలో చేసిన విభజన చట్టంలోని లొసుగులను కాంగ్రెస్ పార్టీ అప్పుడే సరిచేస్తే ఈ సమస్యలు వచ్చేవి కాదు. మా మిత్రపక్షమైన తెదేపా కెవిపి ప్రైవేటు బిల్లు ఓటింగుకు మద్దతునిస్తామనడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాళ్లు కాంగ్రెస్ ట్రాప్‌లో ఇరుక్కుంటారా? లేదా అన్నది వారి ఇష్టం. కేంద్రం దృష్టిలో ఏపి ప్రత్యేక రాష్ట్రం. నిరంతర విద్యుత్ ఎవరూ కోరకముందే రాష్ట్రానికి అందించాం. మా నిబద్ధతను ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు. మేం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం.’అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఫిరాయింపుల చట్టంపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రస్తావిస్తూ, ఫిరాయింపులకు బిజెపి వ్యతిరేకమని అన్నారు.