రాష్ట్రీయం

ఎవరినీ వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: కాల్‌మనీ వ్యవహారంలో నిందితులు ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా వదిలిపెట్టే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. శాసనసభలో కాల్‌మనీ రాకెట్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆయన ఒక ప్రకటన చేశారు. చంద్రబాబు ప్రకటన సారాంశం చదువుతుండగా, వైకాపా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈకేసుల్లో అధిక వడ్డీతో పాటు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే నిందితులపై సవరించిన ఐపిసి సెక్షన్ల ప్రకారం నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధిక వడ్డీలను వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై రాష్ట్రం మొత్తంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, సొంత సమాచారంతో పోలీసులు 227 కేసులను నమోదు చేశారన్నారు. ఇందులో ఐదు కేసులు అధిక వడ్డీతో పాటు లైంగిక ఫిర్యాదులు ఉన్నాయన్నారు. అరెస్టు అయిన 188 మంది నిందితుల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 65 మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది, సిపిఐ పార్టీకి చెందిన ఆరుగురు, సిపిఎం పార్టీకి చెందిన ఒకరు, బిజెపికి చెందిన నలుగురు, లోక్‌సత్తా పార్టీకి చెందిన ఇద్దరు సానుభూతిపరులు ఉండగా, ఇతరులు 78 మంది ఉన్నారు. ఈ విషయమై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించామన్నారు.
బాధితులు, ఫిర్యాదుదారులు ఎవరైనా జ్యుడీషియల్ కమిషన్ ముందు కాని, పోలీసు శాఖకు గాని స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తిలేదన్నారు. రాష్ట్రప్రజలకు తాను చిత్తశుద్ధితో వాగ్దానం చేస్తున్నానన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ రకమైన వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అణచివేయాలన్న స్థిర నిశ్చయంతో ఉందన్నారు. అందుకోసం కఠినమైన చట్టాన్ని తెచ్చి అధిక వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించేందుకు నిర్ణయించామన్నారు.
డిసెంబర్ 10వవ తేదీన విజయవాడకు చెందిన ఒక మహిళ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తూ యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము అనే వ్యక్తి తనకు పది లక్షల అప్పు ఇస్తానని వాగ్దానం చేసి మిగిలినవారితో కలిసి తనను లైంగిక వేధింపులకు గురిచేశారన్నారు. తనపై అత్యాచారం చేశాడని, సహచరుల లైంగిక వాంఛలు కూడా తీర్చాలని ఒత్తిడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు చంద్రబాబు చెప్పారు.
ఈ కేసులో యలమంచిలి శ్రీరామమూర్తి, పి భవానీ శంకర్, చెన్నుపాటి శ్రీను, ఏపి ట్రాన్స్‌కో డిఇ సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్ ఉన్నారన్నారు. 2010లో వడ్డీవ్యాపారుల ఆగడాలను నిరోధించేందుకు ఒక బిల్లును ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని, చట్టంగా మార్చడంలో విఫలమయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధిక వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఈ అసెంబ్లీ సమావేశంలోనే కఠిన చర్యలు ప్రతిపాదిస్తూ చట్టాన్ని తెచ్చి అణచివేస్తామన్నారు.

వైకాపా ఎమ్మెల్యే జి ఈశ్వరి
అరెస్టుపై హైకోర్టు స్టే

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్యే జి ఈశ్వరిని పోలీసులు అరెస్టు చేయకుండా హైకోర్టు శుక్రవారం స్టే మంజూరు చేసింది. విశాఖపట్నం జిల్లాలో ఆమెపై మూడు పోలీసు స్టేషన్లలో కేసు నమోదైంది. ఎమ్మెల్యే జి ఈశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ విచారించారు. తనను అరెస్టు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నం అక్రమమని ప్రకటించాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. 173 సిఆర్‌పిసి కింద తుది నివేదిక వచ్చే వరకు అరెస్టుపై స్టే ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కాగా పోలీసులు దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది.