తెలంగాణ

టీచర్ల నియామకాలకు ప్రత్యేక కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ఉపాధ్యాయుల నియామకాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల విద్యా సంస్కరణ ఉద్యమం (టిపిఇఆర్‌ఎం) కేంద్రప్రభుత్వాన్ని సూచించింది. జాతీయ నూతన విద్యా విధానం త్వరలో అమలులోకి తీసుకురానున్న నేపథ్యంలో టిపిఇఆర్‌ఎం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. విద్యా విధానంలో వౌలిక మార్పులు ప్రతిపాదించిన ముసాయిదా పత్రాన్ని జూన్ 30న వెబ్‌సైట్‌లో పెట్టిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జూలై 31లోగా నెలరోజుల్లో సూచనలు పంపాలని కోరడం సరికాదని ఉద్యమ ప్రతినిధులు ఎన్ నారాయణ, ఎ నర్సిరెడ్డి, బి సాంబశివ పేర్కొన్నారు. ముసాయిదాను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి అందరికీ అందుబాటులో ఉంచాలని వారు సూచించారు. ఉపాధ్యాయుల పనివిధానాన్ని చక్కదిద్దడానికి తల్లిదండ్రులు ప్రాతినిధ్యం వహించే విద్యా కమిటీలకు అధికారాలు ఇవ్వాలని, నాలుగేళ్ల వయస్సు నుండే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుని ప్రీప్రైమరీ విద్య నిర్వహించాలని, అందుకు అవసరమైన ఉపాధ్యాయులు, వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు. పాఠశాల విద్య పూర్తయ్యేవరకూ ఒకే సిలబస్, ఒకే పరీక్షా విధానం అమలుచేయాలని పేర్కొన్నారు.