తెలంగాణ

ప్రాజెక్టులను అడ్డుకుంటే జనం తరిమికొడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: త్రేతాయుగంలో లోక కళ్యాణం కోసం విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తాటకి, మారీచుడు, సుభాహుడు వంటి రాక్షసులు ప్రయత్నించినట్టుగానే, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను డికె అరుణ, రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డిలు అడ్డుకుంటున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి వల్ల ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోతే వారిని ప్రజలు తరిమికొడతారని మంత్రి హెచ్చరించారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, 30 ఏళ్ల క్రితమే ప్రాజెక్టుల నిర్మాణం జరిగి ఉంటే పాలమూరు జిల్లాకు కరువు వచ్చేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై గతంలో బస్సుయాత్ర చేసిన డికె అరుణ, తెలంగాణ రాష్ట్రం కోసం పాదయాత్ర ఎందుకు చేయలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణకు గాంధీ ఎవరో, గాడ్సేలు ఎవరో ప్రజలకు బాగా తెలుసని, వచ్చే ఎన్నికల్లో గాడ్సేలకు ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు చేరగానే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా లక్షా 440 వేల ఎకరాలకు నీరు విడుదల చేయబోతున్నామని మంత్రి జూపల్లి తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల గురువారం నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు మంత్రి జూపల్లి తెలిపారు. పదివేల కిలో మీటర్ల పొడవునా రహదారుల పక్కన బుధవారం 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినప్పటికీ వర్షాలు పడకపోవడంతో వాయిదా వేస్తున్నామన్నారు.
నాటిన ప్రతి మొక్కను పరిరక్షించేందుకు నెలకు ఒక్కో మొక్కపై రూ. 15 వరకు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు.