తెలంగాణ

నిర్వాసితులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 20: నల్లగొండ జిల్లాలో సాగర్ టెయిల్ పాండ్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం సహాయ, పునరావాసం కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం టెయిల్‌పాండ్ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ నిర్వాసిత గ్రామాల మీదుగా టెయిల్‌పాండ్ వరకు రెండు రోజుల పాదయాత్రను పెద్దవూర మండలం జమ్మనకోట నుండి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ టెయిల్‌పాండ్ నిర్మాణంతో తొమ్మిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, భూములు కోల్పోతున్న రైతులకు 2001లో భూసేకరణ చేసి 2009లో కొందరికి కేవలం ఎకరాకు లక్ష 30 వేల చొప్పున పరిహారం ఇచ్చారన్నారు. పునరావాసానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అసైన్డ్, బంజరాయి భూములకు పరిహారం ఇవ్వలేదన్నారు. గతంలో నిర్ణయించిన పరిహారం న్యాయబద్ధంగా లేకపోవడంతో నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని వారికి 2013 భూసేకరణ చట్టం మేరకు పరిహారం, పునరావాసం కల్పించి అదనంగా నాలుగురెట్ల పరిహారం చెల్లించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. టెయిల్‌పాండ్ కింద ఎనిమిది లిఫ్ట్‌లు మునిగి 5 వేల ఎకరాలు బీడుగా మారి రైతులకు ఉపాధి దూరమవుతుందన్నారు. మల్లన్న సాగర్, పాలమూరు-డిండి, ముచ్చర్ల, నీమ్స్ తదితర ప్రాజెక్టుల భూనిర్వాసితులతో కలిసి ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నామన్నారు. నిర్వాసితులంతా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
ఈ పాదయాత్రలో సిపిఎం భూనిర్వాసితుల సంఘం చైర్మన్ బి.వెంకట్, జిల్లా పార్టీ కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, నాయకులు రవినాయక్, ముల్కపల్లి రాములు, బండ శ్రీశైలం, మల్లు లక్ష్మి, బొప్పని పద్మ, వెంకటేశ్వర్లు ఉన్నారు.

సాగర్ టెయిల్ పాండ్ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ పాదయాత్ర చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఫిరాయించిన ఎమ్మెల్యేపై
అనర్హత వేటు వేయండి
స్పీకర్‌కు సిపిఐ విజ్ఞప్తి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 20: తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరిన దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్‌పై అనర్హత వేటు వేయాలని సిపిఐ నాయకులు అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారికి విజ్ఞప్తి చేశారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి బుధవారం స్పీకర్ మధుసూదనా చారిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురై పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌పై రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటువేయాలని వారు కోరారు. అనంతరం చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీలు ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే లోక్‌సభ స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు.
అసెంబ్లీ స్పీకర్ కూడా అదే విధంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.