రాష్ట్రీయం

కొత్త డిజిపిగా సాంబశివరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్‌గా నండూరి సాంబశివరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాంబశివరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా పనిచేస్తున్నారు. డిజిపిగా ఉన్న రాముడు ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం సాంబశివరావు డిజిపిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 31వ వరకూ అదనపు బాధ్యతలతో కొనసాగి, ఆగస్ట్ ఒకటో తేదీనుంచి పూర్తి స్థాయి డిజిపిగా వ్యవహరించనున్నారు. సాంబశివరావు గురువారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కొత్త డిజిపి నండూరి సాంబశివరావు