రాష్ట్రీయం

‘మహా’ముందడుగు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 18: నదుల అనుసంధానంలో భాగంగా మహానది-గోదావరి అనుసంధానం ప్రాజెక్టులో త్వరలో ముందడుగు పడబోతోంది. దశాబ్దాలుగా సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించటంతోనే కాలం గడిచి పోతున్న నేపథ్యంలో త్వరలో డిటైల్డ్ ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను రూపొందించే అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల ఫలితంగా ఇప్పటికే డిపిఆర్‌ను రూపొందించే కార్యక్రమం మొదలు కావల్సివున్నప్పటికీ, మహానదిలో నీటి లభ్యతపై ఒడిశా ప్రభుత్వం అనుమానాలు వ్యక్తంచేయటంతో, తాజాగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ పాత్ర తెరపైకి వచ్చింది.
మహానది, గోదావరి నదుల్లో మాత్రమే మిగులు జలాలు ఉంటాయని ఇప్పటికే జాతీయ జల అభివృద్ధి మండలి (ఎన్‌డబ్ల్యుడి) రూపొందించిన అంచనాల్లో స్పష్టమైనప్పటికీ, మరోసారి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ మహానదిలోని నీటి లభ్యతను అంచనావేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దాంతో జాతీయ హైడ్రాలజీ సంస్థ మహానదిలో నీటి లభ్యతను అధ్యయనం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. గోదావరితో అనుసంధానించడానికి అవసరమైన నీటి లభ్యత మహానదిలో కచ్చితంగా ఉందని, ఒకవేళ అలాంటి అనుమానం తలెత్తినప్పటికీ, బ్రహ్మపుత్ర నది నుండి మహానదికి నీటిని తరలించటం ద్వారా మహానది-గోదావరి నదుల అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తిచేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ హైడ్రాలజీ సంస్థ నుండి నివేదిక వచ్చిన వెంటనే డిపిఆర్ రూపొందుతుందని ఎన్‌డబ్ల్యుడి వర్గాలు చెబుతున్నాయి. మహానదిపై మణిభద్ర వద్ద రిజర్వాయరును నిర్మించటం ద్వారా మహానది-గోదావరి అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనకు ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం చెప్పటంతో, మరింత తక్కువ ముంపుతో అనుసంధానించడానికి మణిభద్రకు 14కిలోమీటర్ల ఎగువన బర్ముల్లా వద్ద రిజర్వాయరు నిర్మించి, అక్కడి నుండి అనుసంధానించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనివల్ల గోదావరి నదిలోకి ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజికి 15కిలోమీటర్లు ఎగువన 4వేల 46మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి కలుస్తుంది. మహానది-గోదావరి నదుల అనుసంధానం పూర్తయితే గోదావరి డెల్టాకు ప్రతి ఏటా ఎలాంటి అనుమానం లేకుండా సాగు, తాగునీటి సరఫరా జరగటంతో పాటు, గోదావరి నీటిని గోదావరి-కావేరి-వైగై మీదుగా మహానది నుండి 9నదుల అనుసంధానంతో నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. ఒడిశాలో 316కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 526కిలోమీటర్లు పొడవున అనుసంధానం కాలువను నిర్మించే విధంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
రాజమండ్రిలోనే డివిజన్ కేంద్రం అవసరం
మహానది-గోదావరి నదుల అనుసంధానంలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన ఎన్‌డబ్ల్యుడి డివిజన్ కేంద్ర కార్యాలయాన్ని తిరిగి రాజమండ్రికి తరలించాల్సిన అవసరం తాజా పరిణామాల్లో ఏర్పడింది. నాలుగైదేళ్ల క్రితం వరకు రాజమండ్రిలోనే ఉన్న ఈ కార్యాలయాన్ని ప్రస్తుతం భువనేశ్వర్ తరలించారు. డిసెంబర్ 1నుండి రాజమండ్రిలోని సబ్-డివిజన్‌ను భువనేశ్వర్ డివిజన్ పరిధిలోకి తీసుకెళ్లారు. మహానది-గోదావరి అనుసంధానం కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో ఇపుడు డివిజన్ కేంద్రానే్న రాజమండ్రికి తరలిస్తే మంచిదని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంటే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని నీటిపారుదల రంగ నిపుణులు సూచిస్తున్నారు.

నల్లమల అటవీప్రాంతంలో డంప్ స్వాధీనం

ఒంగోలు, డిసెంబర్ 18: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంకు సుమా రు 30కిలోమీటర్ల దూరంలోగల నల్లమల అటవీప్రాంతంలోని బూరుగుండాల వద్ద శుక్రవారం యర్రగొండపాలెం పోలీసులు డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లమల అడవుల్లో మావోయిస్టులు ఉనికికోసం ఏరియాపై ఆధిపత్యంకోసం యర్రగొండపాలెం ఎస్‌ఐ ముక్కంటి, స్పెషల్‌బ్రాంచి ఎఎస్‌ఐ కె శ్యాంయేలు రత్నకుమార్ ప్రత్యేక బృందంతో కలిసి నల్లమల అటవీప్రాంతంలోని లోయలో నీటిపరీవాహక ప్రాంతం వద్ద కొండగుహాల వద్ద కుంబింగ్ నిర్వహిస్తుండగా అక్కడ మావోయిస్టులకు సంబంధించిన డంప్ స్వాధీనం చేసుకున్నారన్నారు. 11 రాకెట్ లాంచర్లు, ఒక ఎకె మ్యాగ్జిన్, ఒక తపంచా బ్యారన్, రాకెట్ లాంచర్ విడివిభాగాలు, రెండు గ్యాస్ కట్టర్లు, కవర్ ప్యాకింగ్ మిషన్ ఒకటి, డ్రిల్లింగ్ బిట్స్‌తోకూడిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇదిలాఉండగా జిల్లాలో మావోయిస్టులు లేరని, కదలికలు కూడా లేవని ఎస్‌పి తెలిపారు. కాగా జిల్లాలో 26కాల్‌మనీ ఫైనాన్స్ కార్యాలయాలను తనిఖీచేసి 80మందిని విచారించామన్నారు.