రాష్ట్రీయం

పరవస్తు పద్యపీఠం ఆధ్వర్యంలో 20 నుంచి తెలుగు తిరునాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 18: పరవస్తు పద్యపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు తెలుగు తిరునాళ్లు పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి తెలిపారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలందిస్తున్న పలువురు ప్రముఖులకు ఈ సందర్భంగా పురస్కారాలను అందజేయనున్నట్టు వెల్లడించారు. సాహితీ ప్రముఖులు డాక్టర్ బులుసు వేంకటేశ్వర్లు, వేదుల సుబ్రహ్మణ్య శాస్ర్తీ, చింతకింది శ్రీనివాసరావులకు చిన్నయసూరి విశిష్ఠ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. తెలుగు తిరునాళ్లు తొలి రోజు ఆదివారం ఉదయం మహా సహస్రావధాని, సాగరఘోష కవి గరికపాటి నరసింహరావు ప్రసంగం ఉంటుందన్నారు. అదే రోజు పద్యవిద్య ప్రవీణుడు డాక్టర్ బులుసు వేంకటేశ్వర్లుకు చిన్నయసూరి విశిష్ఠ పురస్కారం అంజేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ‘ప్రమదా విజయం’ శీర్షికన జరిగే కార్యక్రమంలో మహిళల ధీరోధాత్తమైన వ్యక్తిత్వాన్ని చాటే విధంగా పూర్వ కవుల పద్యాలను పార్వతి, సీత, సావిత్రి, సత్యభామ, లక్ష్మీదేవి పాత్రల్లో పఠిస్తారన్నారు. రెండో రోజు సోమవారం సాయంత్రం తెలుగు వ్యాకరణ రంగానికి విశేష సేవలందించిన ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్ర్తీకి పురస్కార ప్రదానం, గరికపాటి ఉపన్యాసం ఉంటుందన్నారు. మూడో రోజు మంగళవారం ఉదయం తెలుగుకథా రంగానికి సేవలందిస్తున్న చింతకింది శ్రీనివాసరావుకు పురస్కార ప్రదానం, తెలుగు పద్యం - రాజనీతి అంశంలో ప్రముఖుల పద్యాలను పఠిస్తారన్నారు. తెలుగు భాషా మహోత్సవాలను చాటే విధంగా తలపెట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.