జాతీయ వార్తలు

హైదరాబాద్‌లో మరో హైకోర్టు అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధాని ప్రాంతంలో ప్రత్యేక భవన సదుపాయాన్ని ఏర్పాటు చేయనంత వరకు హైకోర్టు విభజన జరగకపోవచ్చునని కేంద్ర న్యాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపి హైకోర్టును ఆ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయవలసి ఉన్నది. ఏపి హైకోర్టును తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ఎంత మాత్రం వీలు పడదని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపి రాజధాని ప్రాంతంలో హైకోర్టు కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించటం లేదా ఆ పరిసర ప్రాంతాల్లో పాత భవనాన్ని హైకోర్టు ఏర్పాటుకు కేటాయించవలసి ఉంటుందని, ఇది జరిగినప్పుడే ఉమ్మడి హైకోర్టు విభజన సాధ్యమవుతుందని వారంటున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పది సంవత్సరాల పాటు ఉమ్మడి హైకోర్టును ప్రస్తుత హైకోర్టులో కొనసాగించేందుకు వీలున్నదని వారంటున్నారు. ఏపి హైకోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక భవనాన్ని కేటాయించినా ఈ సమస్యను పరిష్కరించటం సాధ్యం కాదని వారంటున్నారు. ఏపి హైకోర్టు ఉంటే ఉమ్మడి హైకోర్టులో కొనసాగాలి లేదా కొత్త రాజధాని ప్రాంతంలో ఏర్పాటు కావాలని వారు చెబుతున్నారు. తెలంగాణలో ఏపి హైకోర్టును విడిగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర విభజన చట్టం అంగీకరించదన్నది వారి అభిప్రాయం.
నియోజకవర్గాల పెంపు కూడా కష్టమే
రెండు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచటం కూడా ఇప్పుడిప్పుడే సాధ్యం కాదని కేంద్ర న్యాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపి శాసన సభ సీట్ల సంఖ్యను 175 నుండి 225 వరకు తెలంగాణ సీట్లు 119 నుండి 154 వరకు పెంచవలసి ఉన్నది. అయితే రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల సీట్ల సంఖ్యను 2026 వరకు పెంచేందుకు వీలు లేదు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటే నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని సవరించవలసి ఉంటుంది. చట్టాన్ని సవరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారంటున్నారు.