తెలంగాణ

‘కబాలి’ చేతిలో తెలంగాణ రచయత పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 22: సినిమా రిలీజ్ కాకముందే అడ్వాన్స్ బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపిన ‘కబాలి’ సినిమాలోని ఓ సన్నివేశం మరో సంచలనానికి కేంద్ర బిందువైంది. కరీంనగర్‌కు చెందిన ప్రొఫెసర్ రాసిన పుస్తకం కబాలి సినిమాలో హీరో రజినీకాంత్ చదవడం విశేషం. తొలి సన్నివేశంలోనే జిల్లాకు చెందిన ప్రొఫెసర్ రాసిన ‘మై ఫాదర్ బాలయ్య’ అనే పుస్తకాన్ని చేతబట్టి చదవడంతో కరీంనగర్ పేరు చర్చనీయాంశమైంది.
తొలిరోజు సినిమా చూసిన జిల్లా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయ. కరీంనగర్ జిల్లా పేరు మార్మోగిపోయంది. కాగా, హైదరాబాద్‌లో స్థిరపడిన కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ వై.బి. సత్యనారాయణ (70) ‘మై ఫాదర్ బాలయ్య’ పేరిట పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం పలు భాషల్లో అనువదింపబడి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలైన ఆక్స్‌ఫర్డ్, హార్వార్డ్‌ల్లోని లైబ్రరీల్లో అందుబాటులో ఉంది. ఈ పుస్తకాన్ని సినిమాలో హీరో రజినీకాంత్‌తో జైలు సన్నివేశంలో చదివించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయంది.

దళిత సమాజానికి
దక్కిన గౌరవం: వై.బి
కబాలి సినిమాలో తాను రాసిన ‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకాన్ని డైరెక్టర్ హీరో రజినీకాంత్‌తో చదివించడం దళిత సమాజానికి దక్కిన గౌరవమని పుస్తకం రాసిన రిటైర్ట్ ప్రొఫెసర్ వై.బి.సత్యనారాయణ ‘ఆంధ్రభూమి’తో అన్నారు. కబాలి సినిమాలో తన పుస్తకాన్ని చూపించడం గొప్ప ఆనందాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. సినిమా డైరెక్టర్ రంజిత్ తనతో మాట్లాడారని, పుస్తకాన్ని బాగా రాసారని కితాబిచ్చినట్లు తెలిపారు.

కబాలి చేతిలో వై.బి.సత్యనారాయణ
రాసిన పుస్తకం ‘మై ఫాదర్ బాలయ్య’