రాష్ట్రీయం

బిరబిరా శ్రీశైలానికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్/కర్నూలు, జూలై 23: శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చిచేరుతోంది. జూరాల నుంచి విడుదలైన వరద నీరు శనివారం మధ్యాహ్నానికి శ్రీశైలం జలాశయాన్ని చేరుకుంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 788.88 అడుగులకు చేరుకుంది. 23.88 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ జూరాల గేజ్ పాయింట్ వద్ద 35 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జూరాల జలాశయంలో 9.6 టిఎంసిల నీరు నిల్వ ఉంది. విద్యుదుత్పత్తి అనంతరం దిగువకు 32 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుంచి వరద నీటి విడుదల తగ్గినా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా, కర్నాటక సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షాలకు జూరాలకు వరద నీటిచేరిక మళ్లీ పెరిగింది. జూరాలకు 36 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 4,500 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. 32 వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి అనంతరం నదిలోకి వదిలిపెడుతున్నారు. వీటికి తోడు నల్లమల అరణ్యంలో కురిసిన వర్షం నీటితో కలిపి శనివారం శ్రీశైలానికి 35 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

చిత్రం.. జూరాల ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో మహబూబ్‌నగర్ జిల్లా బీచ్‌పల్లి దగ్గర శ్రీశైలం
ప్రాజెక్టులోకి కృష్ణానది ప్రవాహం