రాష్ట్రీయం

ఇక వేడిని తట్టుకునే వరి వంగడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: భూతాపం పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టు వరి రకాలను అభివృద్ధి చేస్తున్నామని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) డైరెక్టర్ డాక్టర్ రవీంద్రబాబు తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ఐఐఆర్‌ఆర్ భవనంలో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఐఐఆర్‌ఆర్ ఇప్పటికే జాతీయ స్థాయిలో వేర్వేరు పరిశోధనా కేంద్రాల నుండి 75 హైబ్రిడ్ రకాలతో సహా మొత్తం 1100 వరి రకాలను విడుదల చేసిందన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసిఎఆర్)లో భాగమైన ఐఐఆర్‌ఆర్ దేశంలో వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన వరి రకాలను విడుదల చేస్తూ వస్తోందన్నారు. తాజాగా జరిగిన పరిశోధనల ఫలితంగా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ తట్టుకుని, ఎక్కువ ఉత్పత్తిని ఇచ్చే రకాన్ని రూపొందించామని వివరించారు.
ఈ రకాన్ని రైతులకు అందించే ముందు అన్ని కోణాల్లో పరిశోధనలు పూర్తి చేయాల్సి ఉందని, అందుకోసం ఒకటి రెండు సంవత్సరాల కాలం పట్టవచ్చని వివరించారు. తుది పరిశోధనలు పూర్తికాగానే ఈ రకాన్ని రైతులకు అందిస్తామని తెలిపారు.
ఇలాఉండగా ఎక్కువ జింక్ కలిగిన మరొక వరి రకాన్ని ‘డిఆర్‌ఆర్ ధాన్ 45 (ఐఇటి 2382) పేరుతో విడుదల చేశామని వివరించారు. ఈ రకం వరికి వివిధ తెగుళ్లను తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ రకం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రైతులు ఉపయోగించేందుకు సిఫార్సు చేస్తున్నామన్నారు. ఐఐఆర్‌ఆర్ హైదరాబాద్ కేంద్రం ఇప్పటి వరకు మూడు హైబ్రిడ్లతో పాటు 46 వరి రకాలను విడుదల చేసిందని వివరించారు. జాతీయ స్థాయిలో న్యూట్రిషనల్ భద్రత కోసం జరుగుతున్న పరిశోధనలలో భాగంగా ఐఐఆర్‌ఆర్‌కు 130 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందన్నారు.
మూడు ఉప ఉత్పత్తులు
బియ్యంతో మూడు రకాల ఉప ఉత్పత్తులను ఐఐఆర్‌ఆర్ రూపొందించింది. వ్యాజలైన్ తరహాలో ఒక ఉత్పత్తిని, నొప్పుల నివారణకు బామ్ తరహాలో మరొక ఉత్పత్తిని, కాళ్లపగుళ్ల నివారణకు ఇంకొక రకమైన ఉత్పత్తిని రూపొంచినట్టు డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. వీటిని వాణిజ్యపరంగా విడుదల చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని, సాంకేతిక తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు.
ఐఐఆర్‌ఆర్‌కు ఉత్తమ సంస్థ అవార్డు
ఐఐఆర్‌ఆర్‌కు ప్రతిష్ఠాత్మక ఐసిఎఆర్ అవార్డు లభించిందని రవీంద్రబాబు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించే సంస్థకు ‘సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అవార్డు’ ఇస్తారని గుర్తు చేశారు. ఈ అవార్డు వల్ల తమ సంస్థలో పనిచేస్తున్న శాస్తవ్రేత్తలకు ప్రోత్సాహం లభించినట్టయిందని, భవిష్యత్తులో మరిన్ని ఉపయోగకరమైన పరిశోధనలను చేస్తామని వివరించారు.