రాష్ట్రీయం

ధర్మకార్యాలు నిర్వహిస్తున్న టి.సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ ప్రభుత్వం ధర్మ కార్యాలు నిర్వహిస్తోందని జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతి అన్నారు. ఆగస్టు 12నుంచి జరిగే పుష్కరాలకు రావాలని కోరుతో ప్రభుత్వ సలహాదారు, పుష్కరాల ఆహ్వాన కమిటీ చైర్మన్ కెవి రమణాచారి శనివారం ఆయనకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యాశంకర భారతి మాట్లాడుతూ ఏ దేశంలో సకాలంలో వర్షాలు కురుస్తాయో, బ్రాహ్మణులు, రుషులు గౌరవం పొందుతారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురుస్తున్నాయని చెప్పారు. ధర్మం మానసిక ప్రశాంతత ఇస్తుందని చెప్పారు. వైదిక నియమాలను అనుసరించి ధర్మ కార్యాలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. 12 రోజుల పాటు జరిగే పుష్కరాల్లో ప్రజలు పాల్గొనాలని సూచించారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్న తాను ఏమాత్రం అవకాశం ఉన్నా పుష్కరాలకు వస్తానని చెప్పారు.
కృష్ణా పుష్కరాల ఆహ్వాన కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు పాల్గొనే పుష్కరాలకు స్వామి ఆశీస్సులు కావాలని అన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని బీచుపల్లి, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్ మాట్లాడుతూ రెండు జిల్లాల్లో దాదాపు 20 ఘాట్ల వద్ద ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని, మిగిలిన ఘాట్ల వద్ద పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. అప్రోచ్ రోడ్ల వంటి పనులు పూర్తి కావచ్చాయని, మిగిలిన పనులు ఆగస్టు ఒకటో తేదీ కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. రెండు జిల్లాల కలెక్టర్లు పుష్కర పనులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.

చిత్రం.. కృష్ణా పుష్కరాలకు పుష్పగిరి పీఠాధిపతి
విద్యాశంకర భారతిని ఆహ్వానిస్తున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి