రాష్ట్రీయం

లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బోనాలలో భాగంగా ఆదివారం నుంచి సికిందరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాల జాతర నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఇద్దరు మంత్రులు పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్ అనుచురులు పోటీపడి మరీ ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదులతో ముప్పు పొంచి ఉన్నట్లు ముందస్తుగా గుర్తించిన పోలీసులు బోనాలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘాను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఉజ్జయిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినానంతరం బోనాల సమర్పణ, దర్శనార్థం భక్తులను అనుమతించనున్నారు. తెలంగాణ, ఏపి సిఎంలు చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు హజరుకానున్నట్లు తెలిసింది. ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో , మహంకాళీ అమ్మవారి ఆలయం చుట్టూ ప్రాంతాల్లోనూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. సికిందరాబాద్ బోనాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచి ఉత్సవాలు ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రాణిగంజ్ క్రాస్‌రోడ్డు, కర్బాలా మైదానం వద్ద మినిష్టర్‌రోడ్డు, రసూల్‌పురా క్రాస్‌రోడ్డు, సిటివో రోడ్డు, వైఎంసిఏ క్రాస్‌రోడ్డు, సెయింట్ జోన్ రోటరీ మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు.

చిత్రం.. నేడు ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాలు సందర్భంగా ఆదివారం విద్యుద్దీపాలంకరణతో ధగధగలాడుతున్న సికింద్రాబాద్ మహంకాళి ఆలయం