రాష్ట్రీయం

హోదా బాధ్యత కేంద్రానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 23: రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదాతో పాటు, చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత కేంద్రానిదేనని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. విశాఖలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోతున్నప్పుడు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న పలు పార్టీలు మద్దతిచ్చాయని, అప్పటి హామీల అమలు కోసం తాము చేస్తున్న డిమాండ్‌లో వాస్తవికతను గుర్తించి, తమకు సహకరించాలన్నారు. ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో తాను ప్రధానంగా లేవనెత్తానని అన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిన విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసన్నారు. చట్టసభలకు తాళాలు వేసి మరీ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పాల్పడిందన్నారు. రెండేళ్ల పసిగుడ్డు నవ్యాంధ్రకు జరిగిన అన్యాయాన్ని తాను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి, ఇతర రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తున్నానన్నారు. ఆర్థిక లోటుతో ఏర్పడిన కొత్త రాష్ట్రానికి కేంద్రం రూ.16వేల కోట్లు సహాయం చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ చేసింది రూ.4వేల కోట్లు మాత్రమేనన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి నామమాత్రంగానే కేటాయింపులు జరిపారని, పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.800 కోట్లు కేంద్రం మంజూరు చేయగా, ప్రాజెక్టు ఆవశ్యకత దృష్ట్యా రాష్టమ్రే నిధులు వెచ్చిస్తోందన్నారు. వెనుకబడిన నియోజకవర్గాలకు ప్రకటించిన విధంగా నిధులు మంజూరు చేయాలని, రెండేళ్లకు రూ.50 కోట్లు చొప్పున మాత్రమే విడుదల చేశారన్నారు. ఇక విభజన చట్టంలో పేర్కొన్న పలు విద్యా సంస్థలు మంజూరైనప్పటికీ కొన్ని ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయన్నారు. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశం కూడా కేంద్రంవద్ద పెండింగ్‌లోనే ఉందన్నారు. అలాగే పారిశ్రామిక రాయితీలు విభజన నాటినుంచి మంజూరు కాలేదన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న చిన్నపాటి సమస్యలను తీర్చేందుకు చొరవచూపాలన్నారు.
రాష్ట్రంలో ఓటమి భయంతో విభజన అంశాన్ని తెరపైకి తెచ్చిన కాంగ్రెస్, టిఆర్‌ఎస్, వైకాపాలతో కలిసి అసంబద్ధంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. తలుపులేసి రాష్ట్రాన్ని విభజించిన పాపం కాంగ్రెస్‌ను వెంటాడిందని, అందుకే ఆపార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారం కోల్పోయిందన్నారు. చేసిన పాపం కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ చట్టసభలో ప్రైవేటు బిల్లు పేరిట కొత్త నాటకానికి తెరతీసిందన్నారు.

చిత్రం.. శనివారం విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు
చిన్నారి అనారోగ్య సమస్యను వివరిస్తున్న కుటుంబ సభ్యులు