రాష్ట్రీయం

ఆంధ్రలో కెటిఆర్ కటౌట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు జన్మదినాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి కెటిఆర్ పుట్టిన రోజును నిర్వహించారు. తన పుట్టిన రోజుకు ఎక్కడా కటౌట్లు ఏర్పాటు చేయవద్దని, ఎక్కడన్నా కటౌట్లు ఉన్నా తొలగించాలని ముందుగానే మంత్రి ఆదేశించడంతో హైదరాబాద్‌లో కటౌట్లు కనిపించలేదు. కానీ చిత్రంగా ఆంధ్రలో భీమవరం, రాజమండ్రి, కాకినాడ వంటి పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కెటిఆర్ కటౌట్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం చర్చనియాంశంగా మారింది. గతంలో భీమవరం నుంచి పోటీ చేస్తాను అని కెటిఆర్ చమత్కరించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో కెటిఆర్‌కు అనేక ప్రాంతాల్లో కటౌట్లు ఏర్పాటు చేయడం సామాజిక మాధ్యమాల్లో చర్చనియాంశంగా మారింది. బేగంపేటలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన పుట్టిన రోజువేడుకల్లో కెటిఆర్‌కు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కెటిఆర్‌లు చలోక్తులు విసురుకున్నారు. బిజెపి శాసన సభ్యులు క్యాంపు కార్యాలయానికి వచ్చి కెటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి శాసన సభాపక్షం నాయకుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు శుభాకాంక్షలు తెలిపారు. కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా హెలికాఫ్టర్ ద్వారా కెటిఆర్ అభిమానులు నగరంలోని పలు ప్రాంతాల్లో పూలు చల్లారు. కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రజాప్రతినిధులు పలు చోట్ల మొక్కలు నాటారు.
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న తెలంగాణ బిజెపి నాయకులు