రాష్ట్రీయం

జైలుకైనా సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు డిజైన్ రూపొందించకముందే బలవంతపు భూసేకరణకు ప్రయత్నించటం ఎంతవరకు సమంజసమని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు బాధితులకు న్యాయం చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎన్నిసార్లు అయనా జెలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్భ్రావృద్ధిలో ప్రజా భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్భ్రావృద్ధి నమూనా ప్రచారాన్ని కొనసాగిస్తామన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జెఏసి ఆధ్వర్యంలో కె.రఘు రచించిన తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతున్నది? పుస్తకావిష్కరణ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రభుత్వం అవంలంబిస్తున్న తీరును ఎండగట్టారు.
ప్రాజెక్టు డిజైన్‌కు ముందే దౌర్జన్యంగా భూసేకరణ ప్రారంభమైందని విమర్శించారు. బలవంతపు భూసేకరణ ప్రయత్నాల వల్లే ప్రజల్లో ఆసహనం తీవ్రమైందన్నారు. ప్రభత్వానికి విద్యుదుత్పత్తిపై ఉన్న శ్రద్ధ వనరులు సమకూర్చుకోవడంపై లేదన్నారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు వల్ల ప్రజలపై ఏటా రూ.3 వేల కోట్లు భారం పడుతుందన్నారు. ఎక్కడ వనరులున్నయో అక్కడే విద్యుదుత్పత్తి చేపట్టి ఎక్కడ అవసరమో అక్కడ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ పాత్రికేయులు రాంచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు లేకున్నా, తీసుకుంటున్న నిర్ణయాలపై సమగ్ర చర్చ జరగాలన్నారు. పుస్తకరచయిత రఘు మాట్లాడుతూ చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాన్ని పునసమీక్షించాలని, లక్ష కోట్లు విద్యుత్ ప్రాజెక్టులపై అసలు చర్చే లేదన్నారు. దీనిపై ప్రజలకు సమగ్ర సమాచారం తెలియాల్సిన అవసరముందన్నారు.