రాష్ట్రీయం

800 అడుగులకు చేరిన నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 25: శ్రీశైలం జలాశయం నీటి మట్టం సోమవారం 800 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి 31 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో 29.01 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాలలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 802 అడుగులు ఉండగా, 30.23 టిఎంసిల నీరు నిల్వ ఉంది. తుంగభద్రకు నీటి చేరిక గణనీయంగా తగ్గిపోయింది. ఎగువ నుంచి వస్తున్న ఆరు వేల క్యూసెక్కుల నీటిలో ఎగువ, దిగువ కాలువకు 4,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 100 టిఎంసిలు కాగా సోమవారం 40 టిఎంసిల నీరు నిల్వ ఉంది. దీంతో తుంగభద్ర జలాశయం నుంచి శ్రీశైలానికి ఇప్పట్లో నీరు వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. కాగా శ్రీశైలం జలాశయం నీటిమట్టం 840 అడుగులకు చేరగానే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి సీమకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీరు విడుదల చేయాలి. అయితే విభజన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల దృష్యా సీమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాదిలా ఈసారి కూడా 840 అడుగులకు చేరగానే నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.