రాష్ట్రీయం

పుష్కరాలకు సినీ శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: కృష్ణా పుష్కరాలకు జాతీయ స్థాయి ప్రచారం ఇచ్చేందుకు బాబు సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే కుంభమేళాలో జరిగే పుష్కరాలకు సంబంధించిన గత కార్యక్రమాలు, ప్రచార తీరుపై సమాచార శాఖ అధ్యయనం చేస్తోంది. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకూ జాతీయ స్థాయిలో ప్రచారం చేసిన బాబు సర్కారు, ఈసారి కృష్ణా పుష్కరాలకూ అంతకుమించి ప్రచారం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో షార్ట్ఫిలిం తీయించాలని నిర్ణయించినట్లు సమాచారం. గోదావరి పుష్కరాల సమయంలో బాబు కుటుంబసభ్యులు పుష్కరస్నానం చేస్తున్న దృశ్యాలతోపాటు, భక్తులను కవర్ చేస్తూ ఆయనే షార్ట్ఫిలిం తీసిన విషయం తెలిసిందే. కృష్ణా పుష్కరాలకూ ఆయనతోనే షార్ట్ఫిలిం తీయించాలని, మరో ప్రముఖ నటుడు సాయికుమార్‌తో వాయిస్ ఓవర్ చెప్పించాలని ప్రభుత్వ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదేవిధంగా సినీ రచయిత జొన్నవిత్తులతో పుష్కరపాటలు రాయిస్తుండగా, మాధవపెద్ది సురేష్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్పీతోపాటు మరో గాయకుడితో రెండు పాటలు పాడించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిని మంగళవారం ఖరారు చేయనున్నారు. వీటి ట్రాక్‌లను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. పాటలను బాబు స్వయంగా వింటున్నారు. వాటిలో కొన్ని సూచనల చేసిన తర్వాత పాటలను ఖరారు చేస్తున్నారు.