నిరుద్యోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదలవుతోన్న సమయంలో వయో పరిమితి సడలింపును మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఈమేరకు మంగళవారం సాధారణ పరిపాలన శాఖ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వయో పరిమితి సడలింపు వెసులుబాటు యూనిఫామ్ సర్వీసుల్లో (పోలీసు, ఎక్సైజు, ఫైర్, ఫారెస్టు) జరిగే నియామకాలకు వర్తించదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. గత జూలై 27న ప్రభుత్వోద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ జారీ చేసే నోటిఫికేషన్లతోపాటు ఇతర సంస్థలు జరిపే నియామకాల్లోనూ వయో పరిమితిని 34నుంచి 44 ఏళ్లకు పెంచుతూ జీవో 329 జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భావంతో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత దశాబ్దకాలంగా ఎదురు చూసింది. అయితే తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. నిరుద్యోగులు వయసు మీరిపోయి, ప్రభుత్వ ఉద్యోగార్హతకు దూరమయ్యారు. దీంతో ప్రభుత్వోద్యోగాల భర్తీకి 34 ఏళ్లున్న వయో పరిమితిని 44 ఏళ్లకు (పదేళ్లు) పొడిగిస్తూ గత జూలై 27న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పొడిగించిన వయో పరిమితి సడలింపు గడువు మంగళవారం అర్దరాత్రితో ముగిసిపోవడంతో, మరో ఏడాదిపాటు 27 జూలై, 2017 వరకు వెసులుబాటును కొనసాగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.