రాష్ట్రీయం

అన్నదమ్ముల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణ్యం, జూలై 26: కర్నూలు జిల్లా పాణ్యంలో మంగళవారం జంట హత్యలు జరిగాయి. రైల్వేస్టేషన్ సమీపంలో పట్టపగలు ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అన్నదమ్ములను నరికి చంపడం కలకలం రేపింది. కొలిమిగుండ్ల మండలం బోయ ఉప్పలూరుకు చెందిన దారా ఓబులేసు (35), దారా లక్ష్మయ్య (33)లను ప్రత్యర్థులు పాణ్యం రైల్వేస్టేషన్ సమీపంలో వేటకొడవళ్లతో నరికి చంపారు. 2015లో జరిగిన గొల్ల రామకృష్ణ హత్య కేసులో ఓబులేసు, లక్ష్మయ్య ప్రధాన నిందితులు. మంగళవారం బనగానపల్లె కోర్టులో కేసు వాయిదాకు హాజరై తిరిగి విజయవాడ వెళ్లేందుకు పాణ్యం రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా దారికాచిన ప్రత్యర్థులు మారణాయుధాలతో వెంబండించి తలలు నరికి చంపారు. అనంతరం స్కార్పియోలో పరారయ్యారు.
ఆలయాల్లో విలువలు బోధించాలి
ఆలయాల రక్షణ ఉద్యమ కన్వీనర్ సౌందరరాజన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26 : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో భక్తులకు నైతిక విలువల గురించి బోధించాలని ఆలయాల పరిరక్షణ ఉద్యమం (టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్) కన్వీనర్ ఎంవి సౌందరరాజన్ కోరారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, స్వామి దయానంద సరస్వతి దాఖలు చేసిన ఒక పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ కొనసాగిస్తోందని గుర్తు చేశారు. నైతిక విలువలను ఒక సబ్జెక్టుగా చేరిస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. దేవాలయాల్లో భక్తులకు ధర్మాన్ని గురించి, నైతిక విలువల గురించి బోధించడంలో ఎలాంటి తప్పులేదన్నారని సౌందరరాజన్ వివరించారు. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో భారతీయ సంప్రదాయాలు, నీతి, న్యాయం, ధర్మం గురించి బోధించాలని, నైతిక విలువలకు అందరూ కట్టుబడి ఉండాలని బోధించడంలో శ్రద్ద వహించాలని కోరారు.
ఏపిలో ఉద్యోగాలు భర్తీ చేయాలి
నిరుద్యోగులకు నెలకు రెండు వేల భృతి ఇవ్వాలి
బిసి సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: టిడిపి ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఇంతవరకు గ్రూప్స్ సర్వీసు నోటిఫికేషన్ విడుదల చేయలేదని వెంటనే ఖాళీగా ఉన్న 1.45 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర మంతివర్గం పదివేల పోస్టులు మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించిందన్నారు. రెండు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అరకొర పోస్టులు భర్తీ చేయడం దారుణమన్నారు. నిరుద్యోగులకు నెలకు రెండు వేల రూపాయల భృతి చెల్లించాలన్నారు. గ్రూప్-1 సర్వీసుల కింద దాదాపు 800 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద భర్తీ చేయాలన్నారు. గత ఆరు సంవత్సరాలుగా 18 ప్రభుత్వ శాఖల్లో వచ్చే ఫ్రీక్వెన్సీలను న్యాయంగా లెక్కిస్తే ఇంకా ఎక్కువ ఖాళీలు వస్తాయన్నారు. గ్రూప్ -2 సర్వీసు కేటగిరీ కింద డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ల కోటా కింద దాదాపు 2400 సర్వీసు పోస్టులు భర్తీ చేయాలన్నారు. 22 ప్రభుత్వ శాఖల కింద వచ్చే ఈ పోస్టులను లెక్కించి భర్తీ చేయాలన్నారు.