రాష్ట్రీయం

రూ.50 కోట్ల లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకైంది. ఇది రూ.50 కోట్లకు అమ్ముడైంది. సిఐడి ఈ విషయాన్ని నిర్ధారించింది. దాదాపు 60మంది విద్యార్ధులు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు సంపాదించేలా మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఎమ్సెట్-2 లీకేజిపై దర్యాప్తు చేపట్టిన తెలంగాణ సిఐడి ఇంతవరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తును చురుగ్గా ముందుకు తీసుకెళ్తోంది. తీగలాగేకొద్దీ డొంక కదులుతున్నట్లు తెలంగాణ ఎమ్సెట్-1 కూడా లీక్ చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు వైద్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. ఎమ్సెట్-2 లీకేజీపై తాజా నివేదిక గురువారం అందినవెంటనే, పరీక్షను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఎమ్సెట్-2తోపాటు తాజా దర్యాప్తులో ఎమ్సెట్-1 ప్రశ్నపత్రం సైతం లీకైందన్న సమాచారం గుప్పుమనడంతో, రాష్టవ్య్రాప్తంగా వేలాది విద్యార్థుల్లో తీవ్ర అశాంతి, ఆందోళన నెలకొంది. బుధవారం సచివాలయం వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లితండ్రులు ప్రదర్శన జరిపారు. ఎమ్సెట్-2 రద్దు చేయొద్దని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2 (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశ్నాపత్రం లీకైందని సిఐడి (క్రైం ఇన్విస్టిగేషన్ డిపార్ట్‌మెంట్) నిర్ధారించడంతో, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డిజిపి సత్యనారాయణ స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్‌లో నాలుగు బృందాలు వివిధ ప్రాంతాలకు వెళ్లగా, ఒక బృందం వరంగల్, మరోబృందం ప్రకాశం జిల్లా, ఇంకొక బృందం బెంగుళూరు, నాలుగో బృందం ముంబయి, ముఖ్యమైన అధికారులతో కూడిన బృందం ఢిల్లీవెళ్లింది. ఇప్పటికే బెంగుళూరులో ఉషా ఎడ్యుకేషనల్ కోచింగ్ సెంటర్‌కు చెందిన రాజగోపాల్ రెడ్డిని, విష్ణు, తిరుమల్, రమేష్‌తో సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌గోపాల్ గతంలో మెడికల్ పిజి పరీక్షా పత్రాన్ని లీక్ చేసిన వ్యవహారంలో నిందితుడిగా ఉన్నారు. టిఎస్ ఎంసెట్-2కు సంబంధించి దాదాపు 50నుండి 80మంది విద్యార్థులకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రాలను అందించారని, అడ్వాన్సుగా డబ్బులు చెల్లించిన విద్యార్థులను బెంగుళూరు తీసుకెళ్లి అక్కడ శిక్షణ ఇచ్చారని వెల్లడైంది. ఇదంతా రహస్యంగా కొనసాగిందని సిఐడి వర్గాలు వెల్లడించాయి.
ఈనెల మొదటి వారంలో ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించిన విద్యార్థులను విమానాల్లో ముంబయి, బెంగళూరుకు నిందితులు తీసుకెళ్లారు. వారికి రహస్య ప్రదేశాల్లో మూడు సెట్ల ప్రశ్నాపత్రాలు ఇచ్చారు. వారి చేత ప్రాక్టీసు కూడా చేయించారు. ఈనెల 7న ప్రశ్నాపత్రాలు విద్యార్థులకు అందించారు. జూలై 9న ఎమ్సెట్-2 పరీక్ష జరిగింది. ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రం లీకైనట్టు సిఐడి వర్గాలు తెలిపాయి. ఎమ్సెట్-2 నిర్వహించిన కార్యాలయం, వారితో సమన్వయంగా ఉండే సిబ్బంది సహకారంతోనే ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకైనట్లుగా సిఐడి వర్గాలు అనుమానిస్తున్నాయి.
కనిగిరికి పాకిన సిఐడి దర్యాప్తు
తెలంగాణ ఎంసెట్ -2 ప్రశ్నాపత్నం లీకేజీ కేసు ప్రకాశం జిల్లానూ తాకింది. జిల్లాలోని కనిగిరికి చెందిన రమేష్ అనే వ్యక్తి హైదరాబాదులో స్థిరపడి, ఈ వ్యవహారానికి పాల్పడినట్టు సిఐడి అధికారులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. అందులో భాగంగా ఆయన బంధువైన ఖాసీంను సిఐడి అధికారులు బుధవారం అదుపులోకి తీసుకుని విచారించి, అతని పాత్రలేదని తేలటంతో విడిచిపెట్టేశారు. కేసులో కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు చెందిన ఫోన్‌కాల్స్ డేటా విశే్లషించి దాని ఆధారంగా కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అందులోభాగంగా రమేష్ అనే నిందితుడి సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్‌డేటా ఆధారంగా ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన పండ్ల వ్యాపారి ఖాసీంను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణకు చెందిన సిఐడి బృందం కనిగిరికి వచ్చి ఖాసీంను విచారించేందుకు ఒంగోలుకు తీసుకెళ్లారు. ఒంగోలులోని ఒక రహస్య ప్రాంతంలో ఖాసీంను విచారించారు. విచారణలో నిందితుడు రమేష్‌కు ఖాసీంకు బాబాయి అవుతాడని తేలింది. బంధుత్వం కారణంగా రమేష్‌తో తరుచూ మాట్లాడానని, తనకు ఎంసెట్-2 పేపరు లీకేజీతో సంబంధం లేదని ఖాసీం సిఐడి అధికారులకు తెలిపారు. ఖాసీం వాంగ్మూలన్ని రికార్డు చేసుకున్న సిఐడి అధికారులు అనంతరం అతడిని విడిచిపెట్టారు. ఎంసెట్-2 పేపరు లీకేజిలో కనిగిరి చెందిన రమేష్ ప్రధాన నిందితుడు కావటంతో ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. రమేష్ గత కొనేళ్లుగా హైదరాబాదులో స్థిరపడ్డారు.