జాతీయ వార్తలు

మళ్లీ చైనా దురాక్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: చైనా మరోసారి దురాక్రమణకు దిగింది. ఆ దేశ సైనిక బలగాలు ఇటీవల సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి ఇరు దేశాల మధ్య వివాదంగా ఉన్న భూభాగంలోకి చొరబడ్డాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ)కు చెందిన సైనికులు ఆయుధాలతో పాటు ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోకి ప్రవేశించారు. ఈ ప్రదేశాన్ని డిమిలిటరైజ్డ్ ఏరియాగా ఉంచాలని ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినప్పటికీ చైనా బలగాలు ఆయుధాలతో సహా ప్రవేశించడం గమనార్హం. చమోలి జిల్లా కలెక్టర్, ఐటిబిపి అధికారులు సహా మరికొంత మంది కలిసి ఈ నెల 19న సర్వే చేయడానికి బరహోతి గ్రౌండ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. అక్కడున్న చైనాకు చెందిన పిఎల్‌ఎ బలగాలు ఆ స్థలం తమదని పేర్కొంటూ అక్కడి నుంచి ఉత్తరాఖండ్‌కు చెందిన పౌర అధికారులను వెనక్కి పంపించారని ఆ వర్గాలు వివరించాయి.
80 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఈ మైదానాన్ని ఇరు దేశాలు వివాదాస్పద ప్రాంతంగా అంగీకరించాయి. 1957 నుంచి ఇదే కొనసాగుతోంది. ఇరు దేశాలు చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని అంగీకరించి ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చైనా బలగాలు ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. గగనతల ఉల్లంఘనలకు కూడా చైనా తరచుగా పాల్పడుతోందని ఆ వర్గాలు వెల్లడించాయి. భారత్‌తో చర్చలు జరపడానికి 1958 ఏప్రిల్ 19న చైనా తన ప్రతినిధి బృందాన్ని పంపించింది. బరహోతి మైదానంపై తుది ఒప్పందం కుదరకపోయినప్పటికీ ఆ ప్రాంతానికి ఏ దేశం కూడా సైనిక బలగాలను పంపించవద్దని ఇరు దేశాల మధ్య అప్పట్లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఐటిబిపి ఆ ప్రదేశంలోకి ఎప్పుడూ ప్రవేశించలేదని ఆ వర్గాలు చెప్పాయి. అయితే ఇరు దేశాలకు చెందిన పశువుల కాపరులను మాత్రం ఈ మైదానంలోకి అనుమతిస్తున్నారు. చొరబాటు విషయం వెలుగులోకి వచ్చిన తరువాత చైనా బలగాలు ఆ మైదానంలోంచి తిరిగి వెళ్లిపోయినప్పటికీ, 1958 నాటి ఒప్పందాన్ని చైనా తనకు అనుకూలంగా మలచుకుంటుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ, కేంద్రం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఐటిబిపిని ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు.