ఆంధ్రప్రదేశ్‌

ఆశాజనకంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: ఏపిలో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఈసారి ఆశించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలో మూడు జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతాలు నమోదవ్వడం విశేషం. ఇలాగే వరుణుడు సహకరిస్తే, బంగారు సిరులు కురిపిస్తామంటున్నారు అన్న దాతలు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లోనూ ఒకట్రెండు జిల్లాలు మినహా భారీ వర్షాలు నమోదయ్యాయి. జూలై నాటికి గతేడాది కంటే మూడు రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 26.7 మిల్లీ మీటర్ల మేర అదనంగా వర్షం కురిసింది. పశ్చిమ గోదావరిలో 11.2 మి.మీ, తూర్పు గోదావరిలో 10.6 మి.మీ మేర అధిక వర్షపాతం నమోదయ్యింది. నెల్లూరులో అత్యల్పంగా వర్షం కురిసింది. ఆ జిల్లాలో సాధారణం కంటే 31.2 మిమీ వర్షపాతం తక్కువగా కురిసింది. ప్రకాశం జిల్లాలో 16.6 మి.మీ, అనంతపురంలో 13.9 మి.మీ మేర సాధారణకంటే తక్కువగా వర్షాలు నమోదయ్యాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గత జూన్ నెల నాటికి 226 మి.మీకు గానూ 241 మి.మీ వర్షం కురిసింది. అయితే ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఉత్తరాంద్రలో భారీ వర్షపాతం నమోదైంది. జూన్ నెల నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షపాతం పరిశీలిస్తే శ్రీకాకుళం మినహా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు బాగా కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం విజయనగరం జిల్లాలో నమోదైంది. ఈ జిల్లాలో సాధారణ కంటే 26.4 మి.మీ వర్షం అధికంగా కురిసింది. విజయనగరంలో ఉన్న తోటపల్లి, జంఝావతి, వేగావతి, చంపావతి, శ్రీకాకుళంలో ఉన్న వంశధార, విశాఖ జిల్లాలో ఉన్న గోస్తనీ, శారదా నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పశ్చిమ గోదావరిలో గత జూన్ నుంచి నేటి వరకు 374.2 మీ.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ కంటే 11.2 మి.మీ అధికమన్న మాట. ఇక తూర్పు గోదావరిలో 368.5మి.మీ మేర వర్షం కురిసింది. ఇది సాధారణ కంటే 10.6 శాతం అధికం. కృష్ణాజిల్లాలో 337.8 మి.మీ మేర వర్షం కురిసింది. ఇది సాధారణకంటే 18.1 మి.మీ అధికం. గుంటూరులో 222.5 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. సాధారణ కంటే 2.9మి.మీ అధికం.
రాయలసీమలోనూ అదే జోరు
కరవుకు నిలయమైన రాయలసీమలో ఈశాన్య రుతు పవనాల కారణంగా ఈసారి భారీ వర్షాలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా భారీ వర్షాలతో తడిసిముద్దయింది. గత నెల జూన్ నుంచి నేటి వరకు చిత్తూరు జిల్లాలో 203.4 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 20.1 అధికంగా కురిసింది. కడపలోనూ ఈ ఏడాది బాగానే వర్షాలు కురిశాయి. గత నెల నుంచి నేటి వరకు 174.9 మీ.మీ వర్షపాతం కడపలో నమోదైంది. ఇది సాధారణ కంటే 13.4 మి.మీ అధికం. ఇక కరవు జిల్లాగా పేరొందిన అనంతపురంలో సాధారణ కంటే 15.5 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఈ జిల్లాలో సాధారణ వర్షపాతం 123.1 మి.మీ కాగా ప్రస్తుతం 142.2మి.మీ మేర వర్షాలు కురిశాయి. కర్నూల్ జిల్లాలోనూ ఈ ఏడాది అధిక వర్షాలు కురిశాయి.
కోస్తాకు వర్ష సూచన
విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ప్రభావానికి అల్పపీడన ద్రోణి తోడవటంతో కోసాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపనాలు చుర్గుగా ఉండటంతో సహా విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపారు.