ఆంధ్రప్రదేశ్‌

అన్నదాతే ధర నిర్ణేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 29: వ్యవసాయదారుడు తను పండించిన ఉత్పత్తులకు తానే ధర నిర్ణయించుకునే రోజు తీసుకువస్తామని, ఇందులో భాగంగా ఆగస్టు ఆరవ తేదీన అనంతపురంలో రైతు ఉత్పత్తి సంఘాలను (ఎఫ్‌పిఓ) ప్రారంభించనున్నట్టు చంద్రబాబు తెలియచేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి 5,400 వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని, రైతులు తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు మార్కెటింగ్ చైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సేద్యంలో విధానాలు, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, మెలకువలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. సాయిల్ టెస్టింగ్, విత్తనాలు, ఎరువులు, రుణాలు, సూక్ష్మ పోషకాలు, విద్యుత్, గ్రీన్ మాన్యూర్, ఆర్గానిక్ ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. భూగర్భ జలాన్ని పెంపొందించామని, వీటన్నింటిని వినియోగించుకుని 13 రకాల పంటల ఉత్పాదకత పెంచాలని రైతులకు సిఎం విజ్ఞప్తి చేశారు.
మెట్ట పంటల్లో ఉత్పత్తి పెరగాలని, డ్రైస్పెల్స్ రాకుండా, మాయిస్చర్ స్ట్రెస్ లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 3371 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించామని, మిగిలిన ఖాళీలలను త్వరలోనే భర్తీ చేస్తామని సిఎం చెప్పారు.
ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని, ఇది మొదటి స్థానంలోకి రావాలని సిఎం చెప్పారు. కందులు, మినుముల ఉత్పత్తిలో రెండో స్థానం నుంచి మొదటి స్థానంలోకి రావాలని అన్నారు. చెరకులో ఏడో స్థానంలో ఉన్నామని ఇది కూడా నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని సిఎం చెప్పారు.