ఆంధ్రప్రదేశ్‌

ఐఐపిఇకి చురుగ్గా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 29: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ) ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంథ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తరగతి గదులను తీర్చిదిద్దగా, ఇతర ఏర్పాట్లలో ఎయు, హెచ్‌పిసిఎల్, ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థులు బిజీగా ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం బి.టెక్‌లో రెండు కోర్సులతో ఈ విద్యా సంస్థను ప్రారంభిస్తున్నారు. విశాఖ జిల్లాలోని సబ్బవరంలో 150 ఎకరాల స్థలాన్ని ఐఐపిఇ శాశ్వత భవన నిర్మాణానికి జిల్లా యంత్రాంగం స్థలాన్ని కేటాయించింది. అక్కడ భవన నిర్మాణం జరిగేంత వరకూ ఎయులో తరగతులు నిర్వహించనున్నారు. జెఇఇ (అడ్వాన్స్‌డ్) ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండు కోర్సుల్లో 50 మంది చొప్పున ఎంపిక చేశారు. ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి విద్యార్థులు వస్తున్నారు. ఈ నెల 31 వరకూ ప్రవేశాలు ఉంటాయి. ఫీజు ఈ లోగా చెల్లించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఐఐటి ఖరగ్‌పూర్ ఈ విద్యాసంస్థకు మెంటార్‌గా వ్యవహరిస్తోంది. బాలురకు విశాలాక్షినగర్ వద్ద ఒక భవనంలో హాస్టల్ వసతి ఏర్పాటు చేశారు. బాలికలకు ప్రస్తుతం హెచ్‌పిసిఎల్ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌పిసిఎల్ డిజిఎం సాధుసుందర్ తెలిపారు. బాలికల సంఖ్యను అనుసరించి ప్రత్యేక హాస్టల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎసి తరగతి గదులతోపాటు అత్యాధునిక ఇ-క్లాస్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు అవసరమైన గైడెన్సు ఇస్తున్నారు. ప్రతిష్టాత్మకమై ఐఐపిఇని అకడమిక్స్‌కు సంబంధించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఐఐపిఇ అడ్వైజర్ డాక్టర్ వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ తెలిపారు. తరగతులను ఆగస్టు 1 నుంచి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. కాగా ఈ విద్యా సంస్థను లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రారంభించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఇంకా పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మంచి భవిష్యత్తు!
విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఐఐపిఇకి మంచి భవిష్యత్తు ఉందని ఐఐటి ఖరగ్‌పూర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్ నియోగి తెలిపారు. ఐఐటి ఖరగ్‌పూర్ ఈ విద్యా సంస్థకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అకడమిక్ ఏర్పాట్లకు సంబంధించి పరిశీలించేందుకు ఆయన శుక్రవారం ఇక్కడకు వచ్చారు.