తెలంగాణ

ఒకరిని కాపాడబోయి మరొకరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, జూలై 29: అడవి పందుల బారి నుండి పంట రక్షణకై వేసిన విద్యుత్ కంచె ఆ కుటుంబంలోని ముగ్గురిని బలిగొంది. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం తొగపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పందిరి హనుమండ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుడుం వెంకటయ్య (65) కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తమ జొన్నపైరును అడవి పందుల బారి నుండి కాపాడుకోవడానికి విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వారి పెంపుడు కుక్క పొలం దగ్గర అమర్చిన విద్యుత్ వైర్‌కు తాకి చనిపోయింది. ఈ విషయాన్ని గమనించిన వెంకటయ్య కుక్కను వైర్ నుండి తప్పిస్తుండగా షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు పొలానికి కొంత దూరంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న అతని భార్య అమృతమ్మ (55), కుమారుడు కిష్టప్ప (39), కోడలు యాదమ్మలకు ఈ విషయం తెలియడంతో పరిగెత్తుకుని అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అదే వైరు కిష్టప్పకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడిని కాపాడబోయి తల్లి అమృతమ్మ సైతం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. అయితే కోడలు యాదమ్మ అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేసినప్పటికిని అప్పటికే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై కోస్గి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.