తెలంగాణ

నల్లగొండకు లింక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 29: ఎంసెట్-2 లీకేజి వ్యవహారంలో నల్లగొండ జిల్లాకు చెందిన తిరుమలేశ్ అలియాస్ తిరుమల్‌రావు అనే వ్యక్తి కూడా భాగస్వామిగా ఉన్నట్లుగా సిఐడి విచారణలో నిర్ధారణ అయంది. అతన్ని అరెస్టు చేసిన సిఐడి ఇందులో ఇంకెందరి ప్రమేయముందన్న కోణంలో విచారణ జరుపుతోంది. జిల్లా పరిధిలోని కేతెపల్లి మండలం చెరుకుపల్లికి చెందిన తిరుమలేశ్ గతంలో నల్లగొండ పద్మావతి కాలనీ నివాసి. చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించి గత కొంతకాలంగా హైద్రాబాద్‌లో ఉంటున్నాడు. ఎంసెట్-2పరీక్ష పేపర్ లికేజి నిందితులతో తిరుమలేశ్‌కు గతంలో తన కుమారుడు ఎంసెట్ పరీక్ష రాసిన సందర్భంలో పరిచయం ఏర్పడింది. లీకేజి ప్రధాన నిందితుడైన రాజగోపాల్‌రెడ్డికి ఎంసెట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మధ్య బ్రోకర్‌గా తిరుమలేశ్ వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. తిరుమలేశ్ ఎంసెట్-2పరీక్ష ప్రశ్నపత్రాన్ని నల్లగొండలోని ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులకు మూడు నాలుగు లక్షల చొప్పున తీసుకుని విక్రయించినట్లుగా సిఐడి బృందాలు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది.
తిరుమలేశ్ విద్యార్థుల తల్లిదండ్రులతో ఎంసెట్ పేపర్ బేరసారాలు నిర్వహించి విద్యార్థులను హైద్రాబాద్, బెంగళూర్‌లకు విమానంలో తరలించి వారితో రెండు సెట్లలో 320 ప్రశ్నలను సాధన చేయించాడని సిఐడి విచారణలో గుర్తించారు. సిఐడి పోలీసులు తిరుమలేశ్‌ను బెంగళూర్‌లో అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో మరింత లోతైన విచారణకు సాగించేందుకు గురు, శుక్రవారాల్లో నల్లగొండలోని తిరుమలేశ్ ఇంటితో పాటు అతడి బంధువుల ప్రమేయం ఉందోలేదో తేల్చేందుకు సిఐడి విచారణ జరుపుతోంది. తిరుమలేశ్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ బావమరిది కావడంతో ఈ కోణంలో కూడా విచారణ బృందాలు దృష్టి సారించినట్లుగా సమాచారం. తిరుమలేశ్ గతంలో ఎంబిబిఎస్ విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో మెడిసిన్ ఎండి సీట్ల బేరసారాలు నిర్వహించాడని తెలుస్తోంది. కాగా తిరుమలేశ్‌ను కఠినంగా శిక్షించాలని, ఎంసెట్ రద్దు వద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు నల్లగొండలోని అతడి నివాసం ముందు ధర్నాలు నిర్వహించి నిరసన తెలిపారు.