ఆంధ్రప్రదేశ్‌

పార్టీ ఎంపీలపై బాబు ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై శుక్రవారం నాటి రాజ్యసభ హోదా చర్చలో కాంగ్రెస్ పార్టీ మైలేజీ సాధించడాన్ని తెదేపా అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. హోదాపై కేంద్రవైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ముందుగనే వాకౌట్ చేసి మైలేజీ సాధించగా, తమ పార్టీ ఎంపీలు వౌనంగా కూర్చోవడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పార్టీ ఎంపీలతో గంటసేపు టెలీకాన్ఫనెన్సు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాజ్యసభలో పార్టీ ఎంపీల పనితీరుపై బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ హోదాపై మాట్లాడుతుంటే మీరు వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేయకపోవడం కరెక్టు కాదు. మీరు అక్కడికి వెళ్లి ఆందోళన చేసి ఉంటే పాజిటివ్ మెసేజ్ వెళ్లేది. కానీ మీరెవరూ దాన్ని పట్టించుకోలేద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు మన స్ట్రాటజీ గురించి ముందే మెసేజ్ పంపినా ఎందుకు ఫాలో కాలేదని విరుచుకుపడగా, ఆ సమయానికి అది అందలేదని ఒక కేంద్రమంత్రి, మరో ఎంపి బదులిచ్చే ప్రయత్నం చేసినా బాబు వినలేదు. వారిద్దరిపై అంతకుముందే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పెర్ఫార్మెన్స్ ఈరోజు ఏమాత్రం బాగాలేదు. మీరు సరిగా యాక్ట్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంది. మీరు ముందే వాకౌట్ చేసి ఉండాల్సింది. ఇకపై అలా జరగకూడదు. ఈ విషయంలో బిజెపి, కేంద్రం పట్ల మొహమాటపడాల్సిన పనిలేద’ని స్పష్టం చేశారు. లోక్‌సభలో పార్టీ నేత తోట నరసింహం తాము కూడా సోమవారం నుంచి లోక్‌సభలో ఆందోళన ప్రారంభించమంటారా? అని బాబును అడిగారు. తాను రేపు, ఎల్లుండోమీకు డైరక్షన్ ఇస్తానని బాబు చెప్పినట్టు తెలిసింది. కాగా, శుక్రవారం నాటి రాజ్యసభ చర్చలో పార్టీ ఎంపీలు ఏవిధంగా వ్యవహరించాలన్న అంశంపై బాబు మధ్యాహ్నానికే సందేశం పంపించగా, సమాచారలోపం వల్ల అది లోపల ఉన్న ఎంపీలకు చేరలేదు. తీరా సభ ముగిసిన తర్వాత ఆ సందేశం అందటం, దానిపై బాబు ఒక కేంద్రమంత్రి, మరో ఎంపీకి అక్షింతలు వేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా, సోమవారం నుంచి లోక్‌సభలో కూడా హోదాపై తెదేపా ఆందోళన ప్రారంభించే అవకాశాలున్నట్లు ఎంపిలు సూచనప్రాయంగా వెల్లడించారు.