జాతీయ వార్తలు

ఇద్దరూ దొంగలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలుపై పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటనపై టిడిపి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు సి.ఎం.రమేష్, గరికపాటి మోహనరావు, టి.జి.వెంకటేష్, తోట సీతారామలక్ష్మి శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శిచారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని రమేష్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఇంత చర్చ జరుగతుంటే కాంగ్రెస్ సభ్యులు సభలో లేకుండా ఎక్కడికి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. బిజెపి తీరు సరిగాలేదని, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు పార్లమెంట్‌లో చేసిన ప్రకటనలను చూస్తుంటే ఏపీకి న్యాయం జరగుతుందన్న నమ్మకం కలగడంలేదన్నారు. టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ, ఏపీ విషయంలో కాంగ్రెస్, బిజెపి తోడుదొంగలుగా మారయని విమర్శించారు. హోదా ఇవ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు.
హోదా ఇవ్వకపోతే ఏపీలో బిజెపికి డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. రాష్ట్ర హక్కుల విషయంలో వౌనంగా ఉండే ప్రశే్నలేదని, ప్రజల కోసం ఏ త్యాగానికైదా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ప్రజల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని ఎంపీ గరికపాటి మోహనరావు ఆరోపించారు. ‘్భరత్‌లో ఆంధ్రప్రదేశ్ భాగం కాదా?, రాష్ట్ర విభజన హామీలను ఎందుకు అమలు చేయడంలేదు?’ అని ఆయన ప్రశ్నించారు.