ఆంధ్రప్రదేశ్‌

మొక్కలు నాటితే మార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 29:ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ నేతలను మొక్కలు నాటే దిశగా ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలు ప్రకటించారు. మొక్కలు నాటిన విద్యార్థులకు ఐదు గ్రేస్ మార్కులు కలుపుతామని, ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీల విషయంలో ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు విరివిగా మొక్కలు నాటితే టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మిషన్ హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా వనం-మనం కార్యక్రమాన్ని శుక్రవారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో మొక్కలు నాటి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ పీల్చే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిందేనన్నారు. ప్రస్తుతం 26 శాతానికి మించి రాష్ట్రంలో పచ్చదనం లేదని, దీన్ని 2029 నాటికి 50 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరూ వన దీక్షను తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని అన్ని నర్సరీల్లో మొక్కలను ఆన్‌లైన్‌లో పెట్టామని, పెద్ద చెట్లను కూడా ఆన్‌లైన్‌లో పెట్టబోతున్నామని చెప్పారు. 13 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతంలో చెట్లను నరికేశారని, ఈ పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సిఎం చెప్పారు. మైదాన ప్రాంతాల్లో 40 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండించాలని నిర్ణయించామని తెలిపారు. 1500 మెట్రిక్ టన్నుల విత్తనాలను అడవుల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో 50 శాతం మొలకెత్తినా, 100 కోట్ల మొక్కలు పెరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. నదుల అనుసంధానం ద్వారా కరవును నివారించడానికి అవకాశం ఉంటుందని, గోదావరి, కృష్ణ నదులను కలిపి తమ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానం చేయకపోతే, ఈఏడాది కృష్ణా జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేది కాదని ఆయన అన్నారు.

chitram...
మొక్కనాటి వనం-మనం కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు