రాష్ట్రీయం

మాకూ ఓ యాప్ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 30: పౌర సేవలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా మొబైల్ అప్లికేషన్స్ రూపొందించడం కోసం సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం మధ్యాహ్నం ఆయన నివాసంలో కలుసుకున్న మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తాము రూపొందించిన కొత్త యాప్ ‘కైజాలా’ను ఆయనకు చూపించారు. బిజినెస్ కమ్యూనికేషన్స్ కోసం దేశీయ అవసరాలకు అనుగుణంగా తొలిసారిగా రూపొందించిన యాప్ ఇదేనని వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నతరహా పరిశ్రమల రంగానికి, 80 లక్షలకు పైగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయాలను చేరువ చేసేలా పూర్తిస్థాయి మొబైల్ అప్లికేషన్ (యాప్)ను తయారుచేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను కోరారు. అందుకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు అంగీకరించారు.