రాష్ట్రీయం

ఎపెక్స్ కౌన్సిల్ భేటీ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న రెండు అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఎపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఎపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసి 10 రోజులు గడచినా మంత్రి ఉమాభారతి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఏపి ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలంటూ ఏపికి చెందిన రైతుల ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఏ వెంకట గోపాల కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలిస్తూ, వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు కేంద్రం ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు జూలై 20న తీర్పు ఇవ్వగా ఇంతవరకు కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ఏపి జలవనరుల శాఖ అసంతృప్తితో మరో లేఖ సంధించింది.
శ్రీశైలం జలాలపై సీమ నేతల పట్టు
శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 819.1 అడుగులకు చేరింది. ప్రస్తుతం 40.21 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 48 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. కాగా దిగువకు 6100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా రిజర్వాయర్ నీటిమట్టం 854 అడుగులకు చేరే వరకూ నీటిని విడుదల చేయరాదని రాయలసీమకు చెందిన అన్ని పార్టీల నేతలు ప్రభుత్వంపై వత్తిడి చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగునీటిని విడుదల చేయాలని వారు చంద్రబాబును ఆదివారం కోరారు. శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల సాధ్యమవుతుంది. ఇప్పుడున్న నీటి ప్రవాహం కొనసాగితే, ఆగస్టు నెలాఖరులోగా 854 అడుగులకు నీటి మట్టం చేరే అవకాశం ఉంది. కాని నాగార్జునసాగర్‌లో ఆశించినట్లుగా నీటి నిల్వ లేదు. ప్రస్తుతం 121 టిఎంసి నీరు ఉంది. ఈ ప్రాజెక్టుకు కేవలలం శ్రీశైలం నుంచి వదిలిన ఆరు వేలక్యూసెక్కులు, మధ్యలో కురుస్తున్న వర్షాలు కలిపి 14వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. ఆగస్టు నెలాఖరు నాటికైనా ఖరీఫ్ పంటకు నీళ్లు ఇవ్వాలంటే శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేయక తప్పని పరిస్ధితి ఉంది.