రాష్ట్రీయం

సిఎం సెక్యూరిటీలో అలసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: ముఖ్యమంత్రి సెక్యూరిటీలో అలసత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ విభాగానికి చెందిన ముఖ్య భద్రతాధికారి వాసుదేవరెడ్డి రివాల్వర్ మిస్‌ఫైర్ అయింది. దీంతో ఆయన్ను అక్కడి విధుల నుంచి తప్పించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తున్న వాసుదేవరెడ్డి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఫైరింగ్ ప్రాక్టిస్ చేయిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం వచ్చిన సిఎం సెక్యూరిటీ ముఖ్య అధికారుల్లో ఒకరైన టిఎన్ సింగ్ సమీపం నుంచి వాసుదేవరెడ్డి రివాల్వర్ బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే ఈ సంఘటనను కొంతకాలం నుంచి గోప్యంగా ఉంచడంతో కాల్పుల కలకలం వెలుగులోకి వచ్చింది. దీంతో వాసుదేవ రెడ్డిని సెక్యూరిటీ విభాగం నుంచి తప్పించి, మిస్ ఫైరింగ్‌పై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సెక్యూరిటీ విభాగం పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. అదేవిధంగా ఈ సంఘటనలో టిఎన్ సింగ్ వ్యవహారంపై కూడా ఆరా తీయాలని అధికారులు ఆదేశించినట్టు తెలిసింది.