తెలంగాణ

ఢిల్లీ కేంద్రంగా లీక్ రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: ఢిల్లీ కేంద్రంగా ఎమ్సెట్ ప్రశ్నాపత్రాల లీకేజి రాకెట్ పని చేసిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లీకుకు ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్‌సింగ్, ఇక్బాల్‌లు ప్రధాన సూత్రధారులుగా తేలిందన్నారు. ఎమ్సెట్ లీకేజీపై సిఐడి అందించిన నివేదికపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారి, జెఎన్‌టియు వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి, వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజి శివధర్‌రెడ్డి, సిఐడి ఐజి సౌమ్య మిశ్రా తదితరులతో కెసిఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్సెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిన విధానాన్ని మీడియాకు వెల్లడించారు. లీకేజీ వ్యవహారంలో మొత్తం 34మంది బ్రోకర్లు కుట్రదారులుగా తేలారని, ఇందులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయగా, మరో ఆరుగురి ఆచూకి తెలిసిందని వివరించారు. మిగతా వారిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్నారు. ఈ లీకేజీ వ్యవహారంలో 200మంది విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లతో సంప్రదింపులు జరిపారన్నారు. ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోవేదనకు కారణమైన ఎమ్సెట్ లీకేజీ వ్యవహారంలో పకడ్బందీగా దర్యాప్తు జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా, ఎక్కడున్నా అరెస్టు చేయాలని, మరోసారి ఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రాలు లీక్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్రోకర్లతో చేతులు కలిపిన విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.