రాష్ట్రీయం

అంతా ఇక్బాలే చేయించాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్సెట్-2 లీకేజి కేసులో రెండవ నిందితుడు రాజ్‌గోపాల్ రెడ్డి సిఐడి విచారణలో విస్తుగొలిపే అంశాలు వెల్లడించాడు. ఢిల్లీ కర్నాటక భవన్, బెంగళూరు హోటల్ వౌర్యాలో ఎమ్సెట్-2 లీక్‌పై తాము ‘వ్యూహ రచన’ చేసినట్టు రాజ్‌గోపాల్‌రెడ్డి పోలీసులకు తెలిపాడు. మొదటి నిందితుడు ఇక్బాల్ సహాయంతో ఎమ్సెట్-2 ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు రాజ్‌గోపాల్‌రెడ్డి వెల్లడించారు. ఈ వాంగ్మూలం నివేదికను నాంపల్లి కోర్టుకు సిఐడి సమర్పించింది. రాజ్‌గోపాల్ వాంగ్మూలం ప్రకారం కర్నాటకలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజిమెంట్ కోటా కింద సీట్లను వివిధ రాష్ట్రాల విద్యార్ధులకు రాజ్‌గోపాల్‌రెడ్డి ఇప్పించేవాడు. ఈ క్రమంలో రాజ్‌గోపాల్‌కు హైదరాబాద్‌కు చెందిన విష్ణ్ధుర్, విజయవాడకు చెందిన జ్యోతి బాబు, ఢిల్లీకి చెందిన రాజేష్‌తో పరిచయం ఏర్పడింది. రాజ్‌గోపాల్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు కర్నాటక భవన్‌లో ఉండేవాడు. అక్కడ రాజేష్ స్వయంగా లీకేజి ప్రధాన సూత్రధారి ఇక్బాల్‌ను రాజ్‌గోపాల్‌రెడ్డికి పరిచయం చేశాడు. ఇక్బాల్ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజిమెంట్‌కోటా సీట్లను ఇప్పించేవాడు. ఈ నేపథ్యంలో ఇక్బాల్, రాజ్‌గోపాల్‌రెడ్డి, రాజేష్ తరచూ కలుసుకుంటేవారు. ఈ ముగ్గురు బెంగళూరులోని మెజిస్టిక్ సెంటర్ వద్ద హోటల్ వౌర్యాలో జూన్‌లో కలుసుకున్నారు. తాను తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నపత్రాన్ని సంపాదించానని, రెండు సెట్లు ఉన్నాయని ఇక్బాల్ వారికి చెప్పాడు. రూ. 25 లక్షలు ఇచ్చే వారికి ఈ సెట్లు ఇస్తాననడంతో రాజ్‌గోపాల్‌రెడ్డి ఈ విషయాన్ని విష్ణ్ధుర్, జ్యోతిబాబుకు చెప్పాడు. కనీసం రూ. 40 నుంచి రూ. 50 లక్షలు ఇచ్చేవారిని ఎంపిక చేయాలని, మంచి కమిషన్ ముట్టచెబుతామని రాజ్‌గోపాల్‌రెడ్డి చెప్పాడు. ప్రశ్నపత్రం ఇచ్చేముందే ఎస్‌ఎస్‌సి మార్కుల జాబితా, ఇంటర్ మార్కుల మెమోను తమకు స్వాధీనం చేయాలని, ఆశించిన ర్యాంకు వచ్చాక, తమకు సొమ్ము మొత్తం ముట్టజెప్పాక మార్కుల మెమోలను తిరిగి ఇచ్చేస్తామని రాజ్‌గోపాల్‌రెడ్డి వారికి చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన విష్ణ్ధుర్, తిరుమలరావు 14 మంది విద్యార్ధులను, ఆరుగురు విద్యార్ధుల తల్లితండ్రులను సంప్రదించి డీల్ కుదుర్చుకున్నారు. వీరు రాజ్‌గోపాల్ చెప్పినట్లుగా జూలై 8వ తేదీ ఉదయం విద్యార్ధులను బెంగళూరుకు తరలించారు. జూలై 9వ తేదీన టి-ఎమ్సెట్-2 పరీక్ష హైదరాబాద్ తదితర కేంద్రాల్లో జరిగింది.
8వ తేదీన
జూలై 8వ తేదీన మొదటి నిందితుడు ఇక్బాల్ ఎమ్సెట్-2 రెండు సెట్ల ప్రశ్నపత్రాలతో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చి బన్సవాడి బస్టాప్ వద్ద ఉన్న ఉపహార్ రెస్టారెంట్‌కు విద్యార్ధులను తీసుకురావాలని రాజ్‌గోపాల్‌కు చెప్పాడు. ఈ మేరకు మరో నిందితుడు ఎస్‌ఆర్ పాండు విద్యార్ధులను తీసుకుని ఉపహార్ హోటల్‌కు వెళ్లాడు. వారి వద్ద సర్ట్ఫికెట్లు, బ్లాంక్ చెక్‌లను తీసుకున్నారు. విద్యార్ధుల తల్లితండ్రులను ఉపహార్ హోటల్‌కు రావద్దనే ఆంక్షలు విధించారు.
ఉపహార్ హోటల్‌లో 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు సెట్ల ప్రశ్నపత్రాలను ఇక్బాల్ విద్యార్ధులకు అందించారు. వారు 320 ప్రశ్నలకు ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం కల్పించాడు. అనంతరం విద్యార్ధులను అదే రోజు రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు పంపారు.
కాగా పుణెలో ప్రశ్నపత్రం లీకేజ్‌కి సంబంధించి కూడా పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. ఈ కేసులో నిందితులైన రెసోనెన్స్ ఉద్యోగులు వెంకటరావు, భండారు రవీంద్ర, అరిగె వెంకటరామయ్యలకు బోడుప్పల్‌కు చెందిన షేక్ రమేష్ ఎమ్సెట్ ప్రశ్నపత్రాలు అమ్మజూపాడు. సెట్‌కు రూ. 35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రమేష్ ద్వారా వీరు సోమాజిగూడలోని కనె్సల్టెన్సీ ప్రతినిధి రామకృష్ణను సంప్రదించారు. మొత్తానికి రెసోనెన్స్ సెంటర్ ఉద్యోగులు గౌతం రెడ్డి, మణిదీప్, శే్వత, అనన్య అనే విద్యార్ధుల తల్లితండ్రులకు గాలం వేసి సొమ్ము వసూలు చేసి పుణెకు జూలై 8వ తేదీన తీసుకెళ్లారు. పుణెలో న్యూ బేకరీ సెంటర్ వద్ద ఒక రహస్య ప్రదేశంలో ఈ నలుగురు విద్యార్ధులకు రెండు సెట్ల ప్రశ్నపత్రాలను కనె్సల్టెనీ నిర్వాహకుడు రామకృష్ణ అందించారు. అనంతరం 8వ తేదీన విద్యార్ధులను, వారి తల్లితండ్రులను పుణె నుంచి హైదరాబాద్‌కు పంపారు. ఈ కేసులో కీలకమైన నిందితులు ఇక్బాల్ తదితరులు అరెస్టయితే మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.