రాష్ట్రీయం

పుష్కర స్నానం.. పరమం పవిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 4: పుష్కర స్నానం.. ఓ పవిత్రమైనదిగా ప్రజలు భావించాలని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ ఉద్ఘాటించారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఆలపించిన కృష్ణా పుష్కర స్వాగత గీతం సీడీని గురువారం గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురూజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
పుష్కర స్నానాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాలన్నారు. అన్నివర్గాల ప్రజలకు ధర్మబోధ జరిగే కాలంగా పుష్కరాలను అభివర్ణించారు. ప్రజల మొక్కులు తీర్చేందుకే పుష్కరాలు వస్తాయని తెలిపారు. గజల్ శ్రీనివాస్ గీతాలాపనలో ఉన్న భక్తి భావాన్ని ప్రజలు ఆకళింపు చేసుకోవాలని హితోపదేశం చేశారు. జిల్లా హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి సకల సౌకర్యాలు కల్పిస్తోందని వివరించారు. కోట్లాది మంది భక్తులకు స్నానఘాట్‌లను ఏర్పాటు చేసిందన్నారు. భగవదానుగ్రహం వల్ల ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవడం వల్ల సమృద్ధిగా పుష్కరాలకు నీరు విడుదలవుతోందని తెలిపారు. ప్రజలంతా భక్తితో పుష్కరాలను ఆస్వాదించాలని కోరారు.
పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ యజ్ఞంగా నిర్వహిస్తున్నారని, ప్రజలు సహకరించాలని కోరారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా గౌరవాధ్యక్షుడు గౌరీశంకర్ గౌడ్ మాట్లాడుతూ పుష్కర పర్వదినాలను పండుగగా జరుపుకోవాలన్నారు.

చిత్రం.. గురువారం గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీడీని ఆవిష్కరిస్తున్న విశ్వయోగి విశ్వంజీ తదితరులు