రాష్ట్రీయం

మరో ఇద్దరు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజి కేసులో సిఐడి మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్టయ్యారు. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గుడిపల్లి చంద్రశేఖర్ రెడ్డి (37) హైదరాబాద్ మోతినగర్‌కు చెందిన షేక్ షాకీరా (29)ను సిఐడి అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వీరు అరుగురు విద్యార్థులను కోల్‌కతా తీసుకెళ్లి ప్రశ్నపత్రం అందజేసినట్టు సిఐడి గుర్తించింది. చంద్రశేఖర్ రెడ్డి నలుగురు విద్యార్థులను, షాకీరా ఇద్దరు విద్యార్థులతోపాటు మరో ముగ్గురు బ్రోకర్లు గత నెల 7న కోల్‌కతా వెళ్లారు.
అక్కడ రాత్రి ఓ హోటల్‌లో బస చేసి ప్రశ్నపత్రం ప్రాక్టీస్ చేయించినట్టు సిఐడి గుర్తించింది. చంద్రశేఖర్‌రెడ్డి ఆరుగురు విద్యార్థుల నుంచి బ్లాంక్ చెక్‌లతోపాటు ఎస్‌ఎస్‌సి, ఇంటర్ సర్ట్ఫికెట్లు తీసుకుని బ్రోకర్లకు ఇచ్చినట్టు సిఐడి అధికారులు గుర్తించారు. నిందితుల కోసం ప్రధాన నిందితులు ముకున్ జైన్, నియాంక్ శర్మ, ఇక్బాల్, సునిల్ సింగ్ కోసం సిఐడి గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. వీరు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలుకు పాల్పడ్డట్టు తెలుస్తోందని సిఐడి అనుమానిస్తోంది. రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ, ఆంధ్రా, కర్నాటకలోని విద్యార్థులను, ఇక్బాల్ హర్యానా, ఒడిశా, పుణె విద్యార్థులకు బ్రోకర్లుగా వ్యవహరించినట్టు సిఐడి భావిస్తోంది. ఇదిలావుండగా జెఎన్‌టియుహెచ్ ఇప్పటివరకు ఎమ్సెట్ ప్రశ్నపత్రాల ముద్రణకు కోల్‌కతాకు చెందిన ఒకే ప్రింటింగ్ ప్రెస్‌కు ఏడుసార్లు ఇచ్చినట్టు తెలిసింది. ఇక్కడి నుంచే ప్రశ్నపత్రం లీక్ అయినట్టు, బ్రోకర్లు బీహార్‌కు చెందిన వారుగా సిఐడి అధికారులు భావిస్తున్నారు. జెఎన్‌టియూహెచ్ ఎమ్సెట్-2 ప్రశ్నపత్రాలను వేర్వేరుగా ప్రింటింగ్‌కు ఇవ్వాల్సి ఉండగా రెండు సెట్లు ఢిల్లీలోని కపూర్ ప్రింటర్స్ ఇచ్చారని, ఇక్కడి నుంచే ప్రశ్నపత్రాలు లీకైనట్టు సిఐడి అనుమానాలు వ్యక్తం చేస్తోంది.