రాష్ట్రీయం

వర్గీకరణ సమావేశం రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ షెడ్యూలు కులాల మధ్య చిచ్చు పెడుతోంది. ఇప్పటికే పలుసార్లు మాల, మాదిగా సామాజికవర్గాలకు చెందిన నేతలు బాహాబాహీగా దిగగా, తాజాగా శుక్రవారం ఎస్సీ వర్గీకరణ ప్రజాస్వామికం అన్న అంశంపై శుక్రవారం బషీర్‌బాగ్‌లో ని అంబేద్కర్ లా కాలేజీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రసాభసాగా మారి ఉద్రిక్తతకు దారి తీసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఓ వర్గం, ప్రతికూలంగా మరో వర్గం నినాదాలు చేయటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రజాస్వామికం అంశంపై ఎస్సీ వర్గీకరణ సంఘీభావ కమిటీ నిర్వహించిన ఈ సమావేశంలో ప్రసంగించేందుకు పలువురు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వక్తలతో పాటు జస్టిస్ చంద్రకుమార్, వరవరరావు, గద్దర్, యూ.సాంబశివరావు, ప్రొ.హరగోపాల్, ప్రొ.కోదండరాం, ప్రొ.పిఎల్. విశే్వశరరావుతో పాటు ప్రొ. గాలి వినోద్‌కుమార్, విద్యార్థి సంఘాలు, ఎస్సీ,ఎస్టీ, బిసి సంఘాలకు చెందిన నేతలు హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న మాల వర్గానికి చెందిన కొందరు నేతలు కోదండరాంను విమర్శించారు.
అయితే మాల నేతలను సముదాయించేందుకు కొందరు వర్గీకరణ సంఘీభావ కమిటీ నేతలు యత్నించారు. అయినా ఇరువర్గాలకు చెందిన నేతల మధ్య మాటల యుద్దం తీవ్రం కావటంతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకునేందుకు కుర్చీలు లేపారు. ఈ క్రమంలో ప్రొ.గాలి వినోద్‌కుమార్ తలకు గాయాలయ్యాయి. ఘటన సమాచారం తెలుసుకుని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు మాల వర్గానికి చెందిన నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రశాంతంగా తాము సమావేశం నిర్వహించుకుంటుంటే మాల వర్గానికి చెందిన నేతలు వచ్చి దాడి చేశారని మాదిగ వర్గానికి చెందిన వారు ఆరోపిస్తుండగా, ఎస్సీ వర్గీకరణ చిచ్చు రగిల్చేందుకే కొందరు నేతలు ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని మాల నేతలు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ఇలాంటి హింసతో లక్ష్యాన్ని చేరుకోలేమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రెండు రాష్ట్రాల్లోని ఎస్సీలు తమలో తాము సామరస్యంగా చర్చించుకుని కేంద్రంపై వత్తిడి తేవాలని, ఈ వర్గీకరణ సమస్య రాజకీయ సమస్యగా మారిందని గద్దర్ అన్నారు.